twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీరామరాజ్యం'పై వర్మ సెటైరా అది?

    By Srikanya
    |

    రామాయణం పై సినిమా చేస్తానంటూ ప్రకటించి రామ్‌గోపాల్ వర్మ నిన్నో ప్రకటన చేసారు.అది సంచలనం అవుతుందని ఆయన భావించారు.కానీ నిజానికి అంత పేలలేదు.కానీ అస్సలు ఆయన హఠాత్తుగా ఆ ప్రకటన చేయటం వెనక ఉన్న ఆలోచన మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.బాలకృష్ణ శ్రీరామ రాజ్యం చిత్రం రిలీజైన సందర్భంలో ఈ ప్రకటన చేయటం ఆ చిత్రాన్ని ఉద్దేశించే అంటున్నారు.బాలకృష్ణ తొడ కొట్టడాన్ని సెటైర్ చేస్తూ అప్పలరాజులో ఓ పాటలో పెట్టిన వర్మ ఈ సారి ఇలా మరోసారి బాలయ్యని డైరక్ట్ గా కామెంట్ చేయకుండా రామాయణాన్ని అడ్డం పెట్టుకుని శ్రీరామరాజ్యం చిత్రాన్ని అపహాస్యం చేసే ఆలోచనే అని చెప్పుకుంటున్నారు.ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన కథ చదివిన వాళ్లెవరూ వర్మ అంత తెలివి తక్కువగా అలాంటి సినిమా చేయరనేది స్పష్టం గా చెప్పుతున్నారు.

    ఇక రామ్‌గోపాల్ వర్మ ప్రకటించిన 'రామాయణం'కధలో..'అయోధ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఓనర్ దశరథరావు. ఆయన భార్య కౌసల్య.ఒకసారి పనిమీద ముంబయి వెళ్లిన దశరథరావు అక్కడ పరిచయమైన కైకయి అగర్వాల్‌ని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి పుట్టిన భరత్‌కుమార్‌కే తన కంపెనీ అప్పగిస్తానని మాట ఇస్తాడు. తండ్రి మాట జవదాటని దశరథరావు పెద్ద కొడుకు రామ్‌శంకర్ అయోధ్య గ్రూప్ వర్కర్స్ ఎంత బాధపడ్డా, తన తండ్రి వెళ్లమన్న విధంగా తమ కంపెనీకి సంబంధించిన ఓ సిక్ యూనిట్‌ని నడపడానికి వెళ్లిపోతాడు. అన్నయ్యంటే ప్రాణమున్న లక్ష్మణ్ శంకర్ కూడా అతనితో పాటు వెళ్లి పాతాడు.అయోధ్య గ్రూప్‌కి రైవల్ ఇండస్ట్రీ లంక గ్రూప్. దాని ఓనర్ రావణ్‌రాజు, అతని తమ్ముడు భిషన్‌రాజు, చెల్లెలు శూర్పణఖ. ఈ రెండు గ్రూపుల మధ్య జరిగే ఘర్షణలోంచి వచ్చిన కథే నేను తీయబోయే 'రామ్‌గోపాల్ వర్మ రామాయణం'. మిగిలిన వివరాలు త్వరలో చెబుతాను'అన్నారు.

    English summary
    “I have always been fascinated by the Ramayana.I will make this film and the story will be set in present day Mumbai”, said RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X