»   » పవన్ కళ్యాణ్ ని ఘాటుగా ప్రశ్నించిన రామ్ గోపాల్ వర్మ

పవన్ కళ్యాణ్ ని ఘాటుగా ప్రశ్నించిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మరోసారి పవన్ కళ్యాణ్ పై పడింది. పవన్ కల్యాణ్ ..గతంలో ఎన్నికల సమయంలో ప్రశ్నించటానికి వస్తానన్న సంగతి గుర్తు చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తారు. అలా ప్రశ్నించకపోవటం మోసం చేయటంగా ఆయన అభివర్ణించారు. ఇంతకీ వర్మ ఏమని ట్వీట్ చేసారు...క్రింద మీరు చూడండి...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఎందుకు పవన్ కళ్యాణ్ లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు...ఎక్కడున్నాడు అసలు ఆయన... ఎందుకుని ఆయన క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ మీద మాట్లాడటం లేదనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

'అత్తారింటికి దారేది' చిత్రంతో ఆల్ టైమ్ హిట్ ఇచ్చి రికార్డులు బ్రద్దలుకొట్టిన పవన్ కళ్యాణ్ తర్వాత చాలా కాలం పాటు మళ్లీ మొహానికి రంగేసుకోలేదు. తర్వాత గోపాల గోపాల చిత్రంలో కనిపించినా అదీ పెద్ద పాత్రేం కాదు...సినిమానూ పెద్దగా ఫలితం సాధించలేదు. అయితే ఇప్పుడు మాట్లాడేది ఆ విషయం గురించి కాదు...గబ్బర్ సింగ్ 2 లో ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రారంభించకపోవటం గురించి.

 RGV takes on Power Star Pawan Kalyan

పవన్ ...2014 లో టీడిపి కు సపోర్టు ఇచ్చి ఎలక్షన్ బిజీలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఏమీ వినపడటంలేదు..ప్రశ్నించటం లేదేంటి అని అంతా అంటున్నా ఆయన మాట్లాడటం లేదు..తన అభిప్రాయాలు ప్రస్తుత రాజకీయాలపైన, ఎపికు ప్రత్యేక హోదా పైనా చెప్పటం లేదు. అందరూ ఆయన బయిటకు వచ్చి ఎపి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారని భావించారు. అయితే అదేమీ జరగటం లేదు.

అటు సినిమాలు, ఇటు రాజకీయం గానూ ఆయన స్ధబ్దతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ..మోస్ట్ వాంటెడ్ పర్శన్ గా మారినా ఆయన కనపడటం లేదు. అశలు ఏం జరుగుతోంది. పవన్ రాజకీయాలకు దూరమయ్యారా..లేక వేరే ఆలోచనలు ఉన్నాయా...సినిమాలు కంటిన్యూగా చేస్తారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఆయన ప్రెవేట్ లైఫ్ కు సంభందించిన క్లూ ఒకటీ బయిటకు రావటంలేదు.

English summary
Ram Gopal Varma tweets decided to take on Pawan Kalyan. Pawan never questioned the highhandedness and wrong policies of the governments or rampant corruption be it TDP or TRS or that of PM Narendra Modi but went into silent mode.
Please Wait while comments are loading...