»   » వర్మ సెటైర్స్ ...అఖిల్ నా లేక రామ్ చరణ్ నా?

వర్మ సెటైర్స్ ...అఖిల్ నా లేక రామ్ చరణ్ నా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం క్రియేట్ చేసి వార్తల్లో ఉంటూంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం...ఆ ట్వీట్స్ రీసెంట్ గా లాంచ్ అయిన అక్కినేని వారసుడు అఖిల్ ని ఉద్దేశించినట్లు ఉండటం. మరో ప్రక్క మెగా వారసుడు బ్రూస్ లీ డిసాస్టర్ ప్లాప్ ఇచ్చిన రామ్ చరణ్ ని గుర్తు చేయటం కూడా జరిగింది. ఆ ట్వీట్స్ ఏమిటో మీరూ ఈ క్రింద చూడండి. ఏ హీరో గురించి ఆయన కామెంట్స్ చేస్తున్నారో క్రింద కామెంట్స్ లో తెలియచేయండి.

RGV targets Akhil or Ram Charan?

సినీ వారసులు పాత ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారని... ఆ గీతనురాజ్‌తరుణ్‌ దాటాడని, అతడిని చూసి సినీ వారసులు నేర్చుకోవాలని విమర్శించారు.

ట్రెండ్‌కు భిన్నంగా ఉన్న 'బాహుబలి', 'భలే భలే మగాడివోయ్‌', 'కుమారి 21ఎఫ్‌' వంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నయని ఈ విషయాన్ని పెద్ద హీరోలు గ్రహించాలని పేర్కొన్నారు.

'కుమారి 21ఎఫ్‌'చిత్రం అద్భుతంగా ఉందంటూ... రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్‌, సమర్పకుడు సుకుమార్‌, దర్శకుడు సూర్యప్రతాప్‌కు అభినందనలు చెప్పారు.

రాజ్‌తరుణ్‌ హీరోగా శుక్రవారం విడుదలైన 'కుమారి 21ఎఫ్‌' సినిమాను చూసిన వర్మ.. తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.


పెద్ద బడ్జెట్‌తో చిత్రాలు తెరకెక్కించేవారు, తమ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందని వారు 'కుమారి 21ఎఫ్‌'ని సీరియస్‌గా చూడాలంటూ ట్విట్వర్‌ ద్వారా హితవు పలికారు.

English summary
Ram Gopal Varma seems to have turned his attention to star heroes and their sons now.Praising "Kumari 21 F film", RGV advised them to learn from young actor Raj Tarun on selecting scripts.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu