»   »  మాట తప్పిన రామ్ గోపాల్ వర్మ.. ఇక మారడా...?

మాట తప్పిన రామ్ గోపాల్ వర్మ.. ఇక మారడా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక కామెంట్ విసరనిదే వర్మకు అస్సలు నిద్రపట్టదు.

ఒకపక్క నేనూ పవన్ కళ్యాణ్ కు పిచ్చ అభిమానిని అంటూనే.. ఆయనపై వేయాల్సిన సెటైర్లు అన్నీ వేసేస్తుంటాడు. ఇక వర్మ చేసే కామెంట్లకు పవన్ అభిమానులైతే ఆయనపై పవర్ పంచ్ లు విసురుతుంటారు.తెలుగు చిత్ర పరిశ్రమను వదిలి ముంబై వెళ్లాను అన్నా వర్మ దృష్టి మొత్తం ఇక్కడ సినిమాలపైనే ఉంది.

RGV targets Pawan Kalyan again

అయితే గత కొద్ది రోజుల క్రితమే పవన్ అభిమానుల అసహనానికి గురైన వర్మ ఆ తరువాత తాను ఇంక పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని.. తాను ఏమన్నా పవన్ అభిమానులు తప్పుడు కోణంలోనే చూస్తున్నారని. ఇక ఆ ఈష్యూ లో ఇదే లాస్ట్ ట్విట్ అని ట్విట్టర్ సాక్షిగా అందరికీ చెప్పాడు. కానీ తిరిగే కాలూ ఆడే నోరూ ఊరకే ఉండవన్నట్టు. అలా చెప్పిన కొన్ని రోజులకే మళ్లీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కామెంట్ చేశారు."పవన్ కల్యాణ్" తన "సర్దార్ గబ్బర్‌సింగ్" ని బాలీవుడ్‌లో విడుదల చేసి టాలీవుడ్‌పై ఉన్న నమ్మకాన్ని బీటౌన్‌లో పొగొట్టారని., ఇప్పుడు ఆ నమ్మకాన్ని "బాహుబలి-2" తో రాజమౌళి ఆ నమ్మకాన్ని మూడురెట్లు పెంచి నిలబెడతారంటూ వర్మ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఈ కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఈసారి పవన్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి....

English summary
Director Ram Gopal Varma has targeted Pawan Kalyan once again with his Twitter barbs
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu