»   » ఛార్మి-పూరి విషయమై తీవ్రంగా వర్మ ఖండన

ఛార్మి-పూరి విషయమై తీవ్రంగా వర్మ ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నితిన్ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చార్మి చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పినా, అప్పటికే కావాల్సిన డామేజి జరిగిపోయింది. అయితే పూరి వల్లనే చార్మికి ఈ విషయాలు తెలిసాయని, ఈ విషయం తెలిసిన రామ్ గోపాల్ వర్మ పూరికి క్లాస్ పీకినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయ్, కానీ ప్రొడక్షన్ వ్యవహారాలకు ఆమెను దూరంగా ఉంచు అని సలహా ఇచ్చాడని చెప్పుకున్నారు. ఈ విషయమై వర్మ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. ఆయన ఏం ట్వీట్స్ లు చేసారో మీరూ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వర్మ ట్వీట్ చేస్తూ... నేను పూరి కి ఆమె విషయమై సలహా ఇచ్చాను అనే వార్తలు అబద్దం. నిజమేమిటంటే..నేను ఛార్మిని ఎన్నో విషయాల్లో ముఖ్యంగా ప్రొడక్షన్ ని సూపర్ ఎఫిషెన్సీతో హ్యాండిల్ చేయటంలోనూ గౌరవిస్తాను . అన్నారు. 


అలాగే...నా మీద..పూరి, ఛార్మిలకు సలహా ఇచ్చానని కొందరు పనిలేని జోకర్లు నిజం ఏమిటో చెక్ చేసుకోకుండా... చేసిన ప్రచారానికి ఈ వివరణ సరిపోతుందని భావిస్తున్నాను అనే అర్దం వచ్చేటట్లు మరో ట్వీట్ చేసారు.
RGV trashes Puri-Charmi rumours

ఇక చిరంజీవి 150వ సినిమాకు ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా రద్దయింది. దీంతో చార్మి జోక్యం వల్లనే ఈ సినిమా రద్దయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలతో హర్టయిన ఛార్మి ఈ వ్యవహారాన్ని పెద్దది చేసి నానా యాగీ చేసేసింది.

అసలు నాకూ, నితిన్ సినిమాకూ సంభంధం ఏమిటి...ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి నితిన్ వద్ద డబ్బులు లేవు...సో సినిమా ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు పెట్టేయటం వల్లే ఈ సినిమా మొదలు కాలేదు...దానికి నేనెలా భాధ్యురాలిని అని ఛార్మి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే...తాను రూమర్స్ ని నమ్మి ఆ మాటలు అన్నానని సిన్సియర్ గా క్షమాపణ అడుగుతున్నట్లు తెలియచేసింది.

English summary
Ram Gopal Varma ‏ tweeted: Reports that I advised Puri on her is untrue ..truth is I respect Charmi for many things including super efficiency in handling production. Reports on me advising Puri on Charmi are spread by work less dumbos nd I hope this clarifies to the jokers who write without checking.
Please Wait while comments are loading...