»   » మోడీతో పవన్ మీటింగ్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్

మోడీతో పవన్ మీటింగ్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ పెట్టక ముందు నుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా పవన్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటూ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా వర్మ తన జోరు కొనసాగించారు. పవన్ కళ్యాణ్‌ను మించిన నాయకుడు లేడంటూ డప్పు కొట్టి మరీ ప్రచారం చేసారు.

అయితే బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ కలవడం, ఆయనకు మద్దతు ప్రకటించడం రామ్ గోపాల్ వర్మకు అస్సలు నచ్చడం లేదు. ఈ విషయమై వర్మ తన ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలు చేసారు. మోడీ-పవన్ కళ్యాణ్ మీటింగును ఒక భయానక సంఘటనగా పేర్కొన్నారు వర్మ.

RGV tweet about Pawan - Modi meet

'పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రజల్లో ఒక అద్భుతమైన ప్రభావం చూపింది. కానీ ఆయన కొందరు వ్యక్తులతో చేతులు కలపడం భయాన్ని కలిగిస్తోంది' అంటూ మోడీ-పవన్ మీటింగును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరి పవన్ కళ్యాణ్ మున్ముందు రాజకీయాల్లో తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

పవన్ కళ్యాణ్ ఇటీవల మోడీని కలిసి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మెడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన వస్తే దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి పరుస్తారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి పని చేయడానికి తాను సిద్ధమే అని ప్రకటించారు.

English summary
Taking a dig at Pawan Kalyan's picture with Modi, RGV posted, "After the extraordinary effect pawan created in sheer originality Its horrendous to see him posing wth ppl who don't have 10% of his charisma (sic)."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu