»   » పవన్ సినిమా... బాహుబలిని మించిపోతుంది!

పవన్ సినిమా... బాహుబలిని మించిపోతుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులంతా అక్టోబర్ 11న ‘వరల్డ్ పవనిజం డే' గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ‘వరల్డ్ పవనిజం డే' సందర్భంగా నేను ఓ విషయం బలంగా నమ్ముతున్నాను. త్వరలో రాబోతున్న పవన్ కళ్యాణ్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్' బాహుబలి కంటే పెద్ద హిట్టవుతుంది' అంటూ ట్వీట్ చేసారు.

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈ ఫాలోయింగ్ వెనక కేవలం పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ మాత్రమే కాదు....ఆయన గొప్ప మనసు, సింపుల్ లైఫ్ స్టైల్ కూడా ఓ కారణం.

RGV tweet about Sardar Gabbar Singh

అభిమానులంతా తమ ఐక్యత, ప్రత్యేక చాటుకునేందుకు తమ కంటూ ఓ రోజు ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే 'వరల్డ్ పవనిజం డే'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డేను సృష్టించారు. గత కొన్నేళ్లుగా అక్టోబర్ 11వ తేదీని 'వరల్డ్ పవనిజం డే'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సెలబ్రేట్ చేషన్స్ జరిగాయి.

RGV tweet about Sardar Gabbar Singh

పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆదర్శంగా 'పవనిజం' కాన్సెప్టుతో సమాజానికి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశ్యంతో అభిమానుంలంతా ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ యువత మంచి మార్గంలో నడిచే విధంగా చేయడమే పవనిజం లక్ష్యం.

English summary
"On this #WorldPawanismDay I truly believe that Sardar Gabbar Singh will reach out to the entire whole world more than Bahubali" RGV tweeted.
Please Wait while comments are loading...