twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్లపై ఇస్మార్ట్‌గా సెటైర్ వేసిన రామ్ గోపాల్ వర్మ!

    |

    రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' జులై 18న విడుదలై సంచలన విజయం అందుకుంది. 9 రోజుల్లోనే దాదాపు రూ. 63 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

    ప్రస్తుతం రెండో వారంలోకి ఎంటరైన ఈమూవీ.... బాక్సాఫీసు వద్ద నెం.1 పొజిషన్లో కొనసాగుతూ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని సైతం 'ఇస్మార్ట్ శంకర్' వెనక్కి నెట్టేస్తోంది. నైజాం ఏరియాకు కేంద్ర బిందువైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లే ఇందుకు నిదర్శనం.

    ఇదే విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ... ఇస్మార్ట్‌గా సెటైర్లు వేశారు. ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇస్మార్ట్ శంకర్ ఒక షోకు 1,08,062 వసూలు చేయగా, డియర్ కామ్రేడ్ రూ. 1,04,590 రాబట్టిన విషయాన్ని ట్విట్టర్లో పేర్కొనక్నారు.

    RGV tweet on iSmart Shankar and Dear Comrade collections

    సోమవారం(జులై 29) కూడా వసూళ్ల పరిస్థితి అలాగే ఉంది. మార్నింగ్ షోకు ఇస్మార్ట్ శంకర్ రూ. 51,607, డియర్ కామ్రేడ్ రూ. 40,196 రాబట్టింది. మ్యాట్నీ షోకు ఇస్మార్ట్ శంకర్ హౌస్ ఫుల్ అవ్వగా.... డియర్ కామ్రేడ్ రూ. 96,401 వసూలు చేసింది.

    డియర్ కామ్రేడ్ వసూళ్ల వివరాల్లోకి వెళితే... ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ రూ. 18.85 కోట్లు(డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లు పరిశీలిస్తే రూ. 12.56 కోట్లు రాబట్టింది. ఇందులో రూ.6.83 కోట్లు మొదటి రోజు వసూలు కావడం గమనార్హం. మిక్డ్స్ టాక్ కారణంగా తర్వాతి రెండు రోజులు కలిపినా ఓపెనింగ్స్ డే స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది.

    English summary
    "Is issmart shankar more Issmart than nonissmart comrade or is nonissmart comrade not more issmart than Shankar? Truth only RAM’s VIJAYam knows." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X