»   » 'ఐ హేట్ మోడీ' అంటూ తిక్క చూపెట్టాడు

'ఐ హేట్ మోడీ' అంటూ తిక్క చూపెట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : " మోడీ 2004 లోనే గెలిచి ఉంటే మాటల రాని ప్రధాని పాలనలో పదేళ్లు విలువైన సమయం, మొరుగైన జీవితం కోల్పోయేవాడిని కాను. పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పేయాలా చేసినందుకు మోడిని నేను అసహ్యించుకుంటున్నా," అంటూ మోడిని తన ట్వీట్ ద్వారా పొగడ్తలలో ముంచెత్తారు. గత కొద్ది రోజులుగా వర్మ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ పైన కూడా ఆయన అభిమానం కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడుగా ఓ చిత్రం సినిమా రూపొందుతోంది. ఏవీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విష్ణుపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ''ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. 'రౌడీ' తర్వాత నేను, వర్మ కలిసి చేస్తున్న చిత్రమిది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాము''అన్నారు మంచు విష్ణు. ఈ సినిమాకి '13' అనే పేరు పరిశీలనలో ఉంది.

Rgv tweeted about Narendra Modi

'13' అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటంటే... విష్ణుకి ఇది 13 వ చిత్రం కావటం, 13 అనేది మిస్టీరియస్ సంఖ్య కావటం,తమ కథ కూడా క్రైమ్ తో నడిచే మిస్టరీ తరహా థ్రిల్లర్ చిత్రం కావటం,చిత్రంలోనూ 13 మర్డర్స్ ఉండటంతో అదే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. అలాగే అంకెతో టైటిల్ కావటంతో జనాల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఏ విధమైన సమాచారం లేదు.

వర్మ మాట్లాడుతూ.... విష్ణుతో ఇంకో సినిమా చేస్తున్నాను. కానీ దాని పేరు టెన్షన్‌ కాదు.. అటెన్షన్‌ కాదు. సినిమా పూర్తయ్యాక పేరు చెప్తాను. మరో కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అని చెప్పారు.

English summary

 RGV tweeted : "If Modi ws PM since 2004 instead of Mum Mohan (Manmohan Singh), my life as citizen would have been far better and I hate Modi for making me lose 10 years of quality life,"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu