»   » 'మెగా బాహుబలి': పవన్ కళ్యాణ్ డైరక్షన్, చిరంజీవి హీరో, రామ్ చరణ్ నిర్మాత

'మెగా బాహుబలి': పవన్ కళ్యాణ్ డైరక్షన్, చిరంజీవి హీరో, రామ్ చరణ్ నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో చిరంజీవి 150 వ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందనే విషయమై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆయన మరో సారి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మధ్యలో బాహుబలి చిత్రాన్ని అడ్డం పెట్టారు. ఆయన ట్వీట్స్ ఈ సారి చాలా ఆసక్తిగా సాగాయి. వాటిని ఓ సారి ఇక్కడ చూద్దాం.

RGV tweets on Chiranjeevi And Baahubali

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుంది. చిరంజీవి 150వ సినిమాకి ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులం అనుకుంటున్నామని అన్నారు.

రాంచరణ్ నిర్మాతగా, పవన్ దర్శకత్వంలో మెగాస్టార్ నటనతో 150 వ చిత్రం మెగా బాహుబలిగా గొప్పగా తెరకెక్కించవచ్చు.


ఒక వేళ చిరంజీవి కాకపోతే ఆ సినిమాకి దర్శకత్వం పవన్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాహుబలిని మించుతుందని తెలిపారు.


పవన్ కళ్యాణ్ దర్వకత్వంలో మెగా స్టార్ చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా..అని నేను నిజాయితిగా మెగా అభిమానులను అడుగుతున్నాను అంటూ ట్విట్ చేశారు.

RGV tweets on Chiranjeevi And Baahubali

ఇంతకు నాలుగు రోజుల ముందు కూడా వర్మ..
బాహుబలి చిత్రం రికార్డును చిరంజీవి 150 వ చిత్రం అధిగమిస్తేనే ఏడేళ్ల మెగా అభిమానుల నిరీక్షణకు ఫలితం ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రం బాహుబలి చిత్రాన్ని అధిగమించాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

చిరంజీవి నటించే తదుపరి చిత్రాన్ని నిర్మాతలు బాహుబలికన్నా భారీగా నిర్మించలేకపోతే.. మెగా అభిమానులు నిరాశకు లోనవుతారన్నారు. మెగా స్టార్ నటించబోయే 150వ చిత్రం ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ చిత్రంగా కాకుండా బాహుబలిని కూడా అధిగమించాలన్నారు.

అంతేకాదు...

మెగా వీరాభిమానులందరం బాహుబలి సినిమాను మించి చిరంజీవి 150వ చిత్రం ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. బాహుబలిని మించి చిరు 150వ సినిమా లేకపోతే.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన దానికంటే మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ ట్విట్ చేశారు.

రాజమౌళి తప్ప మరే ఇతర దర్శకులు చిరు 150వ సినిమాకి న్యాయం చేయలేరని భావిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళితే..మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిల కాంబినేషన్ అంతరిక్షాన్ని అందుకుంటుందని అన్నారు.

English summary
Ram Gopal Varma tweeted: " Ram Charan producing,Pawan kalyan directing nd Mega star acting wil make 150 into MegaBahuBali nd I think Mega family owes this to Mega fans"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu