»   » రిలీజ్ రోజు టేపులు తెచ్చుకోండి: పవన్ ఫ్యాన్స్ కు వర్మ, వెటకారమా?

రిలీజ్ రోజు టేపులు తెచ్చుకోండి: పవన్ ఫ్యాన్స్ కు వర్మ, వెటకారమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ని, ఆయన ఫ్యాన్స్ ఏదో ఒకటి అనకపోతే వర్మకు నిద్రపట్టేట్లు లేదు. గత కొద్ది రోజులుగా సైలెంట్ ఉన్న రామ్ గోపాల్ వర్మ ..సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ దగ్గర పడుతూండటంతో ఒక్కసారిగా మళ్లీ రెచ్చిపోయారు.

తనదైన శైలిలో పవన్ అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంసమయ్యాయి. ఇంతకు ముందు సైతం పవన్ బాలీవుడ్ ఎంట్రీపై ట్వీట్ చేసిన వర్మ ఈ సారి ఏకంగా టేప్ లు తెచ్చుకుని క్యూలు కొలవండి అన్నారు.


పై నుంచి చూస్తూంటే పాజిటివ్ గా అనిపించే ఆ ట్వీట్స్ ..వెటకారంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. వర్మకు తోడు బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకునే కమాల్ .ఆర్.ఖాన్ తోడయ్యారు. ఆయన ట్వీట్స్ కు రిప్లై ఇచ్చారు. వెంటనే వర్మ కూడా కమల్ .ఆర్. ఖాన్ కు తన దైన శైలిలో ట్వీట్ చేసారు. చాలా ఆసక్తికరంగా సాగిన ఈ ట్వీట్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


స్లైడ్ షోలో...


బాహుబలికే అంత...

బాహుబలి విడులైన రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టికెట్లకోసం జనం 1.5 కిటోమీటర్ల దూరం క్యూ కట్టారు. ప్రభాస్ కే అంత దూరం క్యూ కడితే, ఇక పీకే కోసం ఏ రేంజ్ లో క్యూకడతారో చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.


పీకే ఫ్యాన్స్

'పీకే ఫ్యాన్స్.. మీరంతా దూరాలు కొలిచే టేపులతో థియేటర్లకు రండి' అని సలహా ఇస్తున్నాడు వర్మ.


కమాల్ ఆర్ ఖాన్ వెటకారం..

జీరో కిలో మీటర్లు ఉంటాయంటూ...


ఆపుతావా...

దయచేసి నాన్సెన్స్ వాగుడు ఆపుతావా.. ముంబైలో మినిమం కిలోమీటరున్నర క్యూ ఉంటుదనుకుంటున్నా అంటూ వర్మ.


కట్టప్ప గ్రేట్

పవన్ కన్నా బాబుబలి కట్టప్ప గ్రేట్ .. రాజమౌళి, ప్రభాస్ గురించి చెప్పద్దు అంటూ..విడుదల ధియోటర్స్

విడుదల ధియోటర్స్

తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్లపై ఉగాది(8న) పండుగనాడు విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా,


రికార్డ్

రికార్డ్

తెలుగు సినిమా చరిత్రలో భారీ స్థాయిలో విడుదలవుతోన్న రెండో చిత్రంగా రికార్డులకెక్కనుంది.ఓవర్సీస్ లో...

ఓవర్సీస్ లో...

దాదాపు 800 స్క్రీన్లు, హిందీలో మరో 800 స్క్రీన్లపై చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఇక తెలుగులో...

ఇక తెలుగులో...

రమారమి రెండున్నరవేల పైచిలుకు స్క్రీన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యే అవకాశంఉంది.అడ్వాన్స్ బుకింగ్ లు

అడ్వాన్స్ బుకింగ్ లు

ఇప్పటికే చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు మొదలై జోరుగా సాగుతున్నాయి.English summary
RGV tweeted:"I think PK fans from all over should come with measuring tapes,measure the q and prove to the whole world that PK is bigger than Prabhas. Compared to 1.5 kilometre long line for Bahubali on 1st day outside Prasad I max..very curious how many kilometres long line SGS will have"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu