»   » పవన్ కళ్యాణ్‌ను ఫుల్లుగా వాడుకుంటున్నాడు!

పవన్ కళ్యాణ్‌ను ఫుల్లుగా వాడుకుంటున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఏ విషయాన్నయినా....తన ఎదుగుదల కోసం, స్వలాభం కోసం వాడుకోవడం బహుషా రామ్ గోపాల్ వర్మకు తెసినంతగా సినీఇండస్ట్రీలో మరెవరికీ తెలియదు కాబోలు. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం ఎన్ని వేషాలు వేసాడో...ఎన్నిసార్లు నోటికొచ్చినట్లు మాట్లాడాడో కొత్తగా చెప్పక్కర్లేదు.

కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ వెంటపడుతున్నాడు. పవన్ రాజకీయాల్లోకి రావాలంటూ మొన్నటి వరకు తేలుకుట్టిన కోతిలా ట్వీట్లు చేసిన చేసిన వర్మ, ఆయన నుంచి స్పందన రాక పోవడంతో...మరో అడుగు ముందుకేసి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ కళ్యాణ్‌ను అంతా ఇడియట్‌‌ అనుకుంటారని వ్యాఖ్యానించారు.

అత్తారింటికి దారేది చిత్రం విడుదలై భారీ సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో వర్మ జోరు మరింత పెరిగిందనే చెప్పాలి. తాజాగా గాంధీ జయంతిని కూడా వదల్లేదు వర్మ. గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా మద్యం, మాంసం అమ్మడం నిషేదం. ఈ నేపథ్యంలో 'రేపు నా పుట్టిన రోజు స్టార్ తెచ్చి పెట్టుకోండి' అని రాసి ఉన్న గాంధీ ఫోటో పోస్టు చేసాడు. ఇలాంటి చూస్తుంటే చాలా బాధేస్తుందని అంటూ ఆ ఫోటోకు కామెంటూ కూడా చేసాడు.

అయితే గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ ఈ రేంజిలో రెచ్చిపోవడానికి ఓ కారణం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. తన తాజా సినిమా 'సత్య-2'ను ప్రమోట్ చేసుకోవడానికి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి గిమ్మిక్కులు ఉపయోగిస్తున్నాడని, తన పేరు ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా చూసుకుంటూ....పరోక్షంగా తన 'సత్య-2' చిత్రానికి పబ్లిసిటీ సంపాదించి పెడుతున్నాడని అంటున్నారు.

English summary
Some filmmakers have roped in Power Star Pawan Kalyan for their movies to gain huge prospects at the Box Office. A few others, who could not afford him, have got success for their films by making references to his name or inviting him as the chief guest for their filmy events. Now, Ram Gopal Varma , best known as RGV, seems to be driving film goers' attention towards his upcoming movie Satya 2 by praising Pawan Kalyan and his film Attarintiki Daredi to sky high, thereby winning the loyalty of his fans.
Please Wait while comments are loading...