twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తిట్టు అర్థం పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడం కాదు: రామ్ గోపాల్ వర్మ కొత్తవాదన

    By Bojja Kumar
    |

    Recommended Video

    RGV Replies To All Pawan Fans

    పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి మీద మాద*****త్ అనే తిట్టు వాడటంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతరులు కలిసి శ్రీరెడ్డి మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు? ఆ పదం ఉపయోగిస్తూ ఆయన్ను, ఆయన తల్లిని తిట్టడం ఏమిటి? అంటూ శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వాదనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

     అది తల్లిని తిట్టే తిట్టు కాదు, దాని అర్థం వేరు

    అది తల్లిని తిట్టే తిట్టు కాదు, దాని అర్థం వేరు

    మాద*****త్ అనే పదం అర్థం తల్లిని తిట్టడం కాదు. అది ఒక ఇంగ్లిష్ వర్డ్ నుండి వచ్చింది. ఒక మగాడు తన అమ్మను కూడా ఇలా ఆలోచిస్తాడా అని మగాడిని తిట్టే తిట్టు. అది ఎలా తల్లికి వర్తింస్తుందో నాకు అర్థం కావడం లేదు.... అంటూ వర్మ వాదించారు.

     మగాడు అంటే ఓకే..... అమ్మాయి అంటే ఓకే కాదా?..

    మగాడు అంటే ఓకే..... అమ్మాయి అంటే ఓకే కాదా?..

    ఆ పదం వాడినందకు కోపమా? లేక పవన్ కళ్యాణ్‌ను ఆ మాట అన్నందుకు కోపమా? అనేది మరో పాయింట్. ఆ పదం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ వాడితే అది స్టేట్ వైడ్ సూపర్ హిట్ అయింది. క్యాచీ వర్డ్ అనే స్టేటస్ కొన్ని నెలల క్రితమే దానికి ఇచ్చారు. మగాడు అంటే ఓకే..... అమ్మాయి అంటే ఓకే కాదా?.... అని వర్మ ప్రశ్నించాడు.

     వారికి తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదా అనిపిస్తుంది

    వారికి తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదా అనిపిస్తుంది

    తిట్టు అనేది కోపాన్ని వ్యక్త పరిచే ఒక పదం. కోపం ఎక్కువగా వచ్చినపుడు దాన్ని అనుకోకండా అందరూ వాడతారు. ఆ మాట కొస్తే పవన్ కళ్యాణ్‌కు ఉన్న కొంత మంది అభిమానులు, వారి లాంగ్వేజ్ చూస్తే వారికి తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదా అనిపిస్తుంది. అంత మాత్రాన అందరు ఫ్యాన్స్ అలా అని అనడం లేదు. ఎందుకంటే నాతో పాటు మా మదర్, సిస్టర్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆయన్ను సీఎంగా చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.... అని వర్మ తెలిపారు.

    ఆ క్రిడిట్ వందశాతం శ్రీరెడ్డికే

    శ్రీరెడ్డికి అపుడు ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు క్లారిటీ లేదు. కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూను ఇంత పెద్దగా చేసి అందరూ దీనిపై కదిలేలా చేసిన క్రెడిట్ కేవలం శ్రీరెడ్డిదే. మన చిన్నప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ గురించి వింటున్నాం. ఇంత రాపిడ్, హెవీ డిస్క్రషన్స్ జరిగింది శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన తెలుపడం వల్లనే. ఆమె అలా చేయడంతో నేషనల్, ఇంటర్నేషనల్ ఫోకస్ టాలీవుడ్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునేలా ఫోర్స్ చేసింది. ఇంటలెక్చువల్స్ అంతా కూర్చుని దీనిపై చర్చించి కమిటీలు వేసే వరకు వెళ్లింది. ఇండస్ట్రీ పెద్దలంతా ఈ సమస్యను సాల్వ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారంటే దానికి కారణం శ్రీరెడ్డి మాత్రమే.... అని వర్మ తెలిపారు.

    అసలు సమస్యను పక్కదారి పట్టించవద్దు

    అసలు సమస్యను పక్కదారి పట్టించవద్దు

    మాద*****త్, పవన్ కళ్యాణ్, కాస్టింగ్ కౌచ్, గతంలో ఆమె ఏం చేసింది అనేది వేర్వేరు ఇష్యూలు. అన్ని కలిపి ఒకేదాంట్లో చూడకూడదు. దీని వల్ల మెయిన్ ఇష్యూ సైడ్ ట్రాక్ అవుతుంది. ఇది బాధ్యతారాహిత్యం అనేది నా భావన. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. అవన్నీ మరిచిపోయి శ్రీరెడ్డి తెరపైకి తెచ్చి కాస్టింగ్ కౌచ్, ఉమెన్స్ రైట్స్ లాంటి అంశాలపై మెయిన్ ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.... అని వర్మ తెలిపారు.

    English summary
    "Hello all, here are my views in the controversial context of Sri Reddy & Pawan Kalyan. Ram Gopal Varma talks about Sri Reddy abusive comments on Pawan Kalyan, and casting couch in Tollywood. Watch out the full video to know RGV's take on the burning issue in Tollywood." RGV said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X