»   » దేవుడు, ఉగ్రవాదులు, బొద్దింకలు అంటూ....వర్మ ఉమెన్స్ డే ట్వీట్

దేవుడు, ఉగ్రవాదులు, బొద్దింకలు అంటూ....వర్మ ఉమెన్స్ డే ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందరిలా ఉండటం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఏం చేసినా సంచలనం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన తీరు వివాదాలకు దారి తీస్తుంది. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశం

తాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబోనని, అయితే మహిళలు అన్ని రోజులూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్నారు. మహిళా దినోత్సవం అంటూ ఏడాదిలో ఒక రోజు వారికి కేటాయించడం కాకుండా, ప్రతి రోజూ వారు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేవుడు సృష్టిలో మహిళలను అందంగా తీర్చిదిద్దారనీ.. ఆ కారణంతోనే సృష్టిలో ఉగ్రవాదులు, బొద్దింకలు వంటి వాటిని సృష్టించినప్పటికీ దేవుణ్ణి క్షమిస్తానని ట్వీట్ చేశారు. స్లైడ్ షోలో వర్మ చేసిన ట్వీట్స్..

ప్రస్తుతం వర్మ ‘వంగవీటి' అనే వివాదాస్పద సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం విజయవాడ రౌడీయిజం చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు విజయవాడలో మాస్ లీడర్‌గా తన ఆధిపత్యం కొనసాగించిన వంగవీటి రంగా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయవాడలో రెండు అగ్రవర్ణం కులాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారిసిందనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

వర్మ ట్వీట్


తాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబోనని, అయితే మహిళలు అన్ని రోజులూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్నారు.

దేవుడిని క్షమించా


దేవుడు సృష్టిలో మహిళలను అందంగా తీర్చిదిద్దారనీ.. ఆ కారణంతోనే సృష్టిలో ఉగ్రవాదులు, బొద్దింకలు వంటి వాటిని సృష్టించినప్పటికీ దేవుణ్ణి క్షమిస్తానని ట్వీట్ చేశారు.

వంగవీటి రత్నకుమారి

వంగవీటి రత్నకుమారి


వంగవీటి మోహన్ రంగా భార్య పాత్ర కోసం ఓ బెంగాళి నటిని ఎంపిక చేసారు వర్మ.

వంగవీటి రాధ

వంగవీటి రాధ


వర్మ చూపించబోయే వంగవీటి రాధ ఈయనే

రంగా

రంగా


వర్మ చూపించబోయే వంగవీటి రంగా ఈయనే

సినిమాటిక్

సినిమాటిక్


నిజానికి పరిటాల కంటే వంగవీటి రంగాది మరింత సినిమాటిక్ జీవిత కథ.

చిక్కు ముడులు

చిక్కు ముడులు


మరి రంగా చరిత్ర సినిమాగా ఇంతకాలం ఎందుకు రాలేదు? అందుకు సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక చిక్కుముడులు ఉన్నాయి.

English summary
"I will not wish Women,Happy Women's day becos I believe Women should be happy all days..Expecting them to be happy only for 1 day is mean. Women are the most beautiful creation of God and for that I will forgive him for creating ugly things like Terrorists, Cockroaches etc" RGV tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu