»   » ‘పెటా’ కోసం సెక్సీగా పెట్రేగిపోయిన మరో తార (ఫోటోలు)

‘పెటా’ కోసం సెక్సీగా పెట్రేగిపోయిన మరో తార (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'పెటా' పేరు వినగానే అందమైన భామలు హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో పెట్రేగిపోవడం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో చూసాం. అయితే ఈ అందాల ప్రదర్శన వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉండటంతో 'పెటా' సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది.

'పెటా'(PETA) సంస్థ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదనుకుంటా. జంతుల హక్కుల కోసం పోరాడే ఈ అంతర్జాతీయ సంస్థకు చాలా మంది సెలబ్రిటీలు తమదైన రీతిలో ప్రచారం చేస్తుంటారు. జంతువులను హింసించ కూడదని, వాటిని చంపి తినకూడదని, మనషి స్వార్థం కోసం వాటిని వాడు కోకూడదని, అవి కూడా మన తోటి జీవులే... మనలాగే వాటికీ జీవించే హక్కు ఉంది, వాటిని ప్రేమించండి, శాఖా హారులుగా మారండి అనేది ఈ సంస్థ సిద్ధాంతం.

తాజాగా 'పెటా' కోసం అందాలతో పెట్రేగిపోతున్న భామల లిస్టులో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ రీచా చద్దా కూడా చేరింది. చేపలు అనేవి మన స్నేహితులు. స్నేహితులను ఆహారంగా తీసుకోవద్దు, శాఖాహారులుగా మారండి అంటూ ఇలా సెక్సీగా సాగరకన్య గెటప్‌లో పెటా యాడ్ కోసం ఫోటోలు ఫోజులు ఇచ్చింది. స్లైడ్ షోలో ఫోలు, మరిన్ని వివరాలు...

శాఖాహారమే మేలంటోంది

శాఖాహారమే మేలంటోంది


మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే శాఖాహారం తినడమే మేలని, మాంసాహారం తినేవారికంటే శాఖాహారం తినే వారు కనీసం 10 సంవత్సరాల ఎక్కువ జీవిస్తారని రీచా చద్దా ప్రచారం చేస్తోంది.

మరి అభిమానుల సంగతేంటి?

మరి అభిమానుల సంగతేంటి?


ఉప్పు చేప పప్పుచారు కలిపి లాగించే......రీచా చద్దా అభిమానులకు ఆమె ఇలా చేపలు తినొద్దంటూ ప్రచారంలోకి దిగడం కాస్త మింగుడు పడని అంశమే!

రీచా చద్దా గురించి...

రీచా చద్దా గురించి...


అమృత్ సర్‌లో పుట్టి, ఢిల్లీలో పెరిగిన రీచా చద్దా మోడలింగు వైపు ఆకర్షితురాలైంది. మోడలింగు రంగంలో అడుగు పెట్టాక తన ప్రయాణం సినిమా రంగం వైపు కొనసాగించింది.

సినీ రంగ ప్రవేశం

సినీ రంగ ప్రవేశం


2008లో ‘ఓయె లక్కీ లక్కీ ఓయె' అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘రామ్ లీలా' చిత్రంలో దీపిక పదకొనె వదిన పాత్రలో నటించింది.

English summary
Richa Chadda poses as a mermaid during PETA's vegetarian ad shoot in Mumbai on Feb 14, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu