Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ హీరోయిన్ విడాకుల కేసు ఫిబ్రవరికి వాయిదా
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ కపూర్ భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ విడాకులకు కూడా అప్లై చేసుకున్నారు. అయితే కొన్ని ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. వారిరువురు ఒక ఒప్పందానికి రాకపోవడంతో మళ్లీ కేసు వాయిదా పడింది. ఫిబ్రవరిలోగా వారు ఒప్పందానికి రావల్సి ఉంటుంది. లేనిచో పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
కరిష్మాకు సంజయ్ కపూర్‌తో 2003 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం 2010 నుంచి కరిష్మా ముంబైలోని తన పుట్టింట్లో ఉంటుంది. పిల్లల కొరకు బాంద్రా కోర్టులో సంజయ్ కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. అందులో వేరొకరితో కరిష్మా డేటింగ్ చేస్తోందని పేర్కొన్నాడు. ఫార్మా కంపెనీ అధినేత సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్‌లో ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..39 ఏళ్ల వయసున్న సందీప్ తోష్నివాల్‌ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కరిష్మా కపూర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సందీప్ తోష్నివాల్ సక్సెస్‌ఫుల్ ఫార్మా కంపెనీ సీఈఓగా ఉన్నారు. కరిష్మా మాదిరిగానే...సందీప్ తోష్నివాల్‌కు కూడా ఆల్రెడీ భార్యతో విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ మధ్య విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ లోపే ఆమె రెండో పెళ్లి గురించిన వార్తలు ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది. గమనించదగిన విషయం ఏమిటంటే కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్ కూడా ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్నవాడే. కరిష్మాను అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఇపుడు అతనితో విడిపోయిన తర్వాత కూడా...... ఆల్రెడీ పెళ్లయిన సందీప్ తోష్నివాల్‌ను రెండో సిద్ధమవుతోంది కరిష్మా. అదే జరిగితే......రెండు వివాహాలు రెండో పెళ్లి వాళ్లనే చేసుకున్న హీరోయిన్‌గా కరిష్మా చరిత్రకెక్కనుంది.