»   » రిషి 'దమ్మున్నోడు' చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

రిషి 'దమ్మున్నోడు' చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిషి హీరోగా, సౌమ్య హీరోయిన్‌గా బివీవి చౌదరి దర్శకత్వంలో లచ్చురామ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'దమ్మున్నోడు' చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఎ. రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియచేసారు. ఇక ఈ సందర్భంగా దర్శకుడు బివీవి చౌదరి మాట్లాడుతూ...తన లక్ష్యాసాధన కోసం పల్లెటూరి నుంచి సిటీకి చేరుకున్న ఓ యువకుడికి నగరంలో ఎదురైన సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించుకొని తన లక్ష్యానికి ఆ యువకుడు ఎలా చేరుకున్నాడు అనేది ఈ చిత్రకథాంశం. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉంటాయి. మాస్ హీరోగా రిషికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇది' అన్నారు. అట్లూరి పుండరీకాక్షయ్య, రాహుల్‌దేవ్, నాజర్, సత్యప్రకాష్, వేణుమాధవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని వందేమాతరం శ్రీనివాస్ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu