»   » బట్టల షాపులో దొంగతనం, సిసిటీవికు దొరికిన హీరో (వీడియో)

బట్టల షాపులో దొంగతనం, సిసిటీవికు దొరికిన హీరో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: హీరో ఏంటి బట్టలు షాపులో దొంగలతనం చేయటమేంటి...అలాంటి పరిస్దితి ఎందుకు వచ్చింది అంటారా...పూర్తి గా చదివితే మీకే అర్దమవుతుంది. బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (అదేనండీ మన జెనీలియా హజ్బెండ్) ఓ బట్టల షాప్ లో బట్టలు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు.

Riteish Deshmukh caught shoplifting on CCTV Camera?

రితేశ్‌ ముంబయిలోని ఓ బట్టల షాపులో నిన్న దుస్తుల్ని దొంగిలించాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు రితేశ్‌ అభిమానులైతే రితేశ్‌ నిజంగానే దొంగతనం చేస్తున్నాడా అని నిమిషం పాటు నోరెళ్లబెట్టుకుని చూస్తుండిపోతూ, ట్విట్టర్ లో ఈ వీడియో ని తెగ షేర్ చేస్తున్నారు. మీరూ చూడండి.

గమనించారా... ఈ వీడియో ఫుటేజ్‌లో రితేశ్‌ ఓ స్టోర్‌లోకి వచ్చి కొన్ని దుస్తుల్ని ట్రై చేసి మరికొన్ని టీ-షర్టులు తాను వేసుకున్న చొక్కాలో దోపేసుకుని వెళ్లిపోతున్నట్లు ఉంది. ఇది చూసి అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు.

మరి ఇది రితేశ్‌ నటించిన హౌస్‌ఫుల్‌ 3 చిత్ర ప్రచారం కోసమా లేక ట్రూబ్లూ బ్రాండ్‌ ప్రచారం కోసమా అన్నది ఎవరూ వెల్లడించలేదు. రితీష్ కూడా ఎక్కడా ఈ విషయమై మాట్లాడటం లేదు. స్పందించలేదు. పబ్లిసిటీ కోసం కాకపోతే ఈ పాటికి పోలీసులు అరెస్జ్ చేస్తారు కదా అంటారా.అదీ నిజమే మరి.

English summary
Riteish Deshmukh was caught on cam 'Shoplifting'! Can you believe a popular actor & s/o former CM would stoop to such a level? Riteish Deshmukh will soon be seen on screen again with the third installment in the super hit 'Housefull' franchise alongside Akshay Kumar , Abhishek Bachchan, Jacqueline Fernandes, Lisa Haydon and Nargis Fakhri . The way in which the film is being produced has already created a buzz around the film with the team carpooling and driving to events together.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu