»   » ఏ జన్మలోనూ వదలిపెట్టను: జెనీలియా

ఏ జన్మలోనూ వదలిపెట్టను: జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ అడల్ట్‌ కామెడీ హీరోగా పేరొందిన రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. సీనీ నటి జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక బాబుకు తల్లిదండ్రులుగా మారినా.. వారి మధ్య ప్రేమ అలాగే ఉందని చెప్పేందుకు రితేశ్‌ తన ట్విట్టర్‌ ద్వారా జెనీలియా చెయ్యి పట్టుకొని నడుస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. అంతేకాదు.. ‘నేను నా జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయం నీ చేయి పట్టుకోవడమే' అంటూ ట్వీట్‌ చేశాడు.

దీనికి జవాబుగా జెనీలియా స్పందిస్తూ.. ‘నీ చేతిని ఈ జన్మలోనే కాదు.. ఏ జన్మలోనూ వదలిపెట్టను.. ఎప్పటికీ మనం ఇలాగే ఉంటాం' అంటూ రీట్వీట్‌ చేసింది.

దీంతో వీరిద్దరి ట్వీట్లు చూసిన వారందరూ ఎంత మంచి అన్యోన్యదంపతులో అంటూ తెగ పొగిడేస్తున్నారు. మొన్నటి వరకు న్యూఇయర్‌ వేడుకల్లో మునిగితేలిన స్టార్స్ ఇప్పుడు ప్రేమికుల రోజును జరుపుకొనే పనిలో బిజీగా ఉన్నట్లున్నారు. తాజాగా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తన భార్య జెనీలియాతో ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

English summary
Riteish Deshmukh took to his Twitter handle to gush about his wife. Posting a picture with Genelia wherein he is holding her hands, Riteish tweeted, "Holding hands with you was the best decision I ever made. geneliad (sic)."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu