రితుపర్ణొ మరణాన్ని ముందే ఊహించారా...ట్వీట్ లో..

ఆ సందర్భంగానే ఆయన చిన్న వయసులోనే కన్నుమూసిన మరో ప్రముఖ దర్శకుడు గురుదత్ ప్రస్తావన తేవడం విశేషం. సాహెబ్ బీవీ ఔర్ గులామ్ చిత్రం తీసేటపుడు గురుదత్ కూడా ఇదే భవనంలో ఉన్నారని తెలిసింది... అని ఘోష్ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. దాంతో ఆయన అభిమానులు ...రితుపర్ణో ముందే మరణాన్ని ఊహించారా అని బాధతో అంటున్నారు.
రితుపర్ణో ఘోష్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. 'అబొమోన్' బెంగాలీ చిత్రానికి గాను 2012లో ఆయన స్పెషల్ జ్యూరీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 19 ఏళ్ల సినీ జీవితంలో ఆయన తీసిన బెంగాలీ, హిందీ చిత్రాలకు గాను 12 జాతీయ పురస్కారాలు సాధించారు.
పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. రితుపర్ణొఘోష్ దర్శకత్వం వహించిన చోఖేర్‌బాలి, రెయిన్‌కోట్, దహన్, ఉత్సవ్, దొసొర్, ద లాస్ట్ లియర్, శోబ్ చరిత్రో, కాల్పొనిక్ తదితర చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఘోష్ తండ్రి కూడా డాక్యుమెంటరీ చిత్రనిర్మాతగా ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications











