»   »  'రోబో' సీక్వెల్ వివాదం...అమీని తొలిగించండి

'రోబో' సీక్వెల్ వివాదం...అమీని తొలిగించండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'రోబో' సీక్వెల్ సినిమా ప్రారంభమై ఓ నాలుగు రోజులు కూడా కాలేదు. అప్పుడే వివాదం వచ్చి మీద పడింది. ఈ వివాదం ఈ సారి హీరోయిన్ అమీ జాక్సన్ రూపంలో వచ్చి చేరింది. ఆమెను తొలిగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలసి నటించే బంపర్‌ ఆఫర్‌ను సొంతం చేసుకుంది నటి అమీ జాక్సన్‌. తమిళ సినిమాలతోనే అధికంగా క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళుల ఆగ్రహానికి గురవుతోంది.

అందుకు కారణం.. జల్లికట్టు క్రీడ. జల్లికట్టు క్రీడను తమిళనాడు నడిపేందుకు నిషేధం విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కొనసాగించాలని కోరుతూ పలువురు నటులతో పాటు అమీ జాక్సన్‌ కూడా సంతకాలు చేసి పంపించారు. అంతేకాకుండా జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్విట్టర్‌లో కూడా వ్యాఖ్యలు చేశారు.

జల్లికట్టు నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయకూడదని, ఇంకా కొనసాగించాలని ఆమె కోరారు. దీనిపై తమిళర్‌ మున్నేట్ర పడై మండిపడుతోంది. తమిళుల ఎంతో ప్రాచీన సాహసక్రీడను నిషేధించమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసింది.

అమీను అర్జెంటు గా... ‘2.0' చిత్రం నుంచి తొలగించాలంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌లను డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరణ మూడురోజుల్లో తెలియజేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

 Robo 2: Amy Jackson gets into trouble over tweet on 'Jallikattu' ban

అలా ఆమెను తొలిగించటం చేయకపోతే.. ఈ నెల 21వతేదీన ఉదయం 11 గంటలకు దక్షిణభారత నటీనటుల సంఘం ఎదుట, శంకర్‌ ఇంటి ఎదుట ఆందోళన చేయనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో జీవనం కొనసాగిస్తూ, తమిళుల సంస్కృతికి విరుద్ధంగా మాట్లాడటం సమంజసం కాదని ఆరోపించింది.

ఇక ఈ చిత్రంలో రజినీకాంత్‌కి జంటగా మరియు ఆడ రోబోగా అమీ జాక్సన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్‌ చేస్తున్నారు.

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా చేసి ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచిఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

English summary
Amy Jackson has just started shooting for director Shankar's film with Rajinikanth, 2.0. However, Amy Jackson has now courted some controversy to a tweet she put out on December 16.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu