»   » ఆ చిత్రంలో ప్రియమణి తల్లిగా రోజా

ఆ చిత్రంలో ప్రియమణి తల్లిగా రోజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా పాత్రకి పేరొస్తుందంటే హీరో తల్లిగా నటించడానికీ సిద్ధం. అయితే ఆ పాత్రకి ఐడెంటిటీ లేకపోతే చెయ్యలేను.'గోలీమార్‌'లో ప్రియమణి తల్లిగా నటిస్తున్నా. పూర్తిస్థాయిలో ఉండే డామినేటింగ్‌ రోల్‌. మగవాడి ప్రేమని నమ్మని పాత్ర. ఈ క్యారెక్టర్‌ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అంటున్నారు రోజా. ఆమె ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న గోలీమార్ లో చేస్తున్నారు. దయానాయక్ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టు గా కనిపిస్తున్నారు. ఇక రోజా పూరీ గుంరించి మాట్లాడుతూ..పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన 'పోకిరి', 'అమ్మ నాన్న ఓ తమిళఅమ్మాయి' వంటి సినిమాలు చూశా. మనసుని హత్తుకునేలా ఆయన డైలాగ్స్‌ ఉంటాయి. 'గోలీమార్‌' లోనూ అలాంటి డైలాగ్స్‌ చాలానే ఉన్నాయి అంటూ మెచ్చుకున్నారు. ఇక తన తదుపురి చిత్రాలు గురించి చెబుతూ ఈ గోలీమార్ తప్ప ఇంకా మరే సినిమానీ ఒప్పుకోలేదు. రెండు సినిమాలకి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి అన్నారు. ఇక సంక్రాంతిక విడుదలైన శంబో శివ శంబో చిత్రంతో ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X