»   » ఇది షాకింగ్ న్యూసే: చిరంజీవి కోసం రంగంలోకి రోజా, నాగబాబే కలిపారా?

ఇది షాకింగ్ న్యూసే: చిరంజీవి కోసం రంగంలోకి రోజా, నాగబాబే కలిపారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150' మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న వేళ పలు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిరంజీవితో సాక్షి ఛానల్ ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ చిత్రీకరించారు. ఈ ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు.... ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఇప్పటికే 150వ సినిమా ప్రమోషన్లు పీక్ రేంజికి చేరుకుంది. సినిమాకు హైప్ తేవడంలో భాగంగానే రోజాతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు సమాచారం. రోజా వైసీపీ ఎమ్మెల్యే కావడంతో జగన్ కు చెందిన సాక్షి ఛానల్ రేటింగు పెంచడంలో భాగంగా ఆమె ఈ ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కామెడీషో ద్వారా నాగబాబు, రోజా మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో.... నాగబాబు కూడా ఈ ఇంటర్వ్యూ చేయడానికి రోజాను ఒప్పించినట్లు సమాచారం.

Roja Interviews Chiranjeevi For Khaidi no 150 Promotion

ఒకప్పుడు సినిమాల్లో చిరంజీవి, రోజా కలిసి నటించారు. తర్వాత చిరంజీవితో పాటు రోజా రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటం వల్ల రాజకీయ విమర్శలు చేసుకున్నారు. చిరంజీవి రోజాపై అంత పెద్ద విమర్శలు చేయక పోయినా... రోజా పలు సందర్భాల్లో చిరంజీవిపై కాస్త ఘాటుగా, నాటుటగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అలాంటి రోజా... చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం అంటే ఆటోమేటిక్ గా జనాల్లో ఆసక్తి పెరుగుతుంది, తద్వారా 150వ సినిమాకు ప్రచారం జరుగడంతో పాటు ఛానల్ టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Roja Interviews Chiranjeevi For Khaidi no 150 Promotion

ఈ ఇంటర్వ్యూలో 150వ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.

English summary
Roja interviewing Chiranjeevi about Khaidi No 150 As Chiranjeevi is coming back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu