»   » అది వేరూ...ఇదివేరూ..! చిరు రాజకీయాలకు పనికి రాడు అన్న రోజానే ఈరోజు ఇలా

అది వేరూ...ఇదివేరూ..! చిరు రాజకీయాలకు పనికి రాడు అన్న రోజానే ఈరోజు ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవిగారితో నేను చేసిన తొలి సినిమా 'ముఠామేస్త్రి'. ఆ సినిమాలో 'ఎంతఘాటు ప్రేమయో పారిజాతమా..' మా ఇద్దరిపై తీసిన తొలిపాట. ఆ పాటలో మా మూమెంట్స్ చూసి... చిరంజీవిగారితో ఆయన భార్య సురేఖ ఒకేమాటన్నారు. 'మీ పక్కన దీటుగా డాన్స్ చేయాలంటే... శ్రీదేవి, రాధ, తర్వాత రోజానే' అని. ఆ టైమ్‌లో నాకది పెద్ద కాంప్లిమెంట్! అలాంటి చిరంజీవిపైనే ఫైట్‌కి దిగుతానని అప్పుడు ఊహించి ఉండరు.పాలిటిక్స్ అంటే అంతే. ఓ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేస్తాం. దాని కోసం ఎంతదూరమైనా వెళతాం. పాపం.. ఆ విషయంలో ఆయన షాక్ అయ్యి ఉంటారు.

చాలా అభిమానంగా ఉండేవాళ్లం కదా. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఎదురవుతుంటాం. నన్ను చూడగానే... మొహం అదోలా పెట్టుకుంటారు. మాట్లాడకుండా సీరియస్‌గా కూర్చుంటారు. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటేనే రాజకీయాల్లో ఇమడగలం. చిరంజీవిలాంటి సున్నితమనస్కుడు రాజకీయాల్లో పనికిరాడు. గతం లో ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ రోజా అన్న మాటలివి రాజకీయ ప్రత్యర్థులైనా... నటీ నటులుగా కొన్ని సంవత్సరాల పాటు కలిసి పని చేసారు ఈ ఇద్దరూ.... అయితే మళ్ళీ ఒక సారి చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది రోజా...

Roja speaks about Chiranjeevi Khaidi no 150

తెలుగు సినీపరిశ్రమలో ఎంతో క్రేజ్ వున్న నటుడు చిరంజీవి అని సినీనటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పింది. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కమ్‌బ్యాక్ గురించి టీవీ9తో మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్‌కి పెట్టింది పేరు, చిరు ఫైట్స్‌ని అభిమానులు విరగబడి చూసేవారు. 9 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరు రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆయన అభిమానులకి ఎంతో సంతోషకరమైన విషయం. మెగాస్టార్‌తో కలిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ చిత్రాల్లో నటించాను. ఆయనతో డాన్స్ చేయడం చాలా కాంపిటీషన్‌గా అనిపించేది అని అభిప్రాయపడింది.

జీవితంలో సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. చిరంజీవి మంచి మనిషి. సినిమాల్లో చిరంజీవి ఎప్పుడూ ది బెస్ట్. డాన్స్, పర్‌ఫార్మెన్స్, ఫైట్స్ అన్నింట్లోనూ చిరు బెస్ట్. చిరు నటించిన ఆపద్బాంధవుడు, రుద్రవీణ వంటి సినిమాలు చాలా ఇష్టం. ఖైదీ సినిమా చిరుకి ఎంత పేరు తీసుకువచ్చిందో ఈ ఖైదీ నెంబర్ 150 కూడా అంతే పేరు తీసుకురావాలి... అంతే సక్సెస్ కావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఈ ఇప్పటి ఎమ్మెల్యే ఒకప్పటి హీరోయిన్ చెప్పారు.

English summary
Heroyin Roja speaks about Chiranjeevi Khaidi no 150 Movie and His re Entry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu