»   » షకీలా దర్శకత్వంలో ‘రొమాంటిక్ టార్గెట్’ (ఫోటోస్)

షకీలా దర్శకత్వంలో ‘రొమాంటిక్ టార్గెట్’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి షకీలా దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం ‘రొమాంటిక్‌ టార్గెట్‌'.నరేశ్‌, శ్వేతా శైన్‌, శ్రీదేవి ప్రధాన తారాగణమైన ఈ చిత్రాన్ని సత్యం సినిమా క్రియేషన్స్‌ పతాకంపై మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజర్ లాంచ్ చేసారు. ఈ టీజర్స్‌ను ప్రముఖ దర్శకుడు సాగర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్‌, కట్టా రాంబాబు ఆవిష్కరించారు. టీజర్స్ బాగున్నాయని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు..

నిర్మాతలు మాట్లాడుతూ..

నిర్మాతలు మాట్లాడుతూ..

‘కథానుసారం ఊటీ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. నేటి సమాజంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తున్న దుష్టశక్తులను ఓ మహాశక్తిగా మారి ఆడవాళ్లు ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులోని ప్రధానాంశం. యాక్షన్‌, క్రైమ్‌, సస్పెన్స్‌, రొమాన్స్‌ వంటి అంశాల మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు షకీలా' అని తెలిపారు.

షకీలా మాట్లాడుతూ...

షకీలా మాట్లాడుతూ...

''నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

తారాగణం

తారాగణం

షకీలా, బాబా భాయ్‌, కావేరి, స్వప్న అరోహి, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, జబర్దస్త్‌ శేషు, స్వామి, ఆజాద్‌, సత్యం, రాధాకృష్ణ, అశోక్‌, దేవి నటించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేశ్‌, పాటలు: బొబ్బా, సయ్యద్‌ అఫ్జల్‌, సంగీతం: కార్తీక్‌, అభిషేక్‌, ఛాయాగ్రహణం: కంకణాల శ్రీనివాసరెడ్డి, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: షకీలా.

English summary
Romantic Target trailer launch. directed by Shakeela. produced by Menta Satyanarayana. music by Abhi & Karthik. starring: Sridevi, Sweta Shaini.
Please Wait while comments are loading...