»   » దాసరిని కిరీటంతో సత్కరించిన రోశయ్య (ఫోటో)

దాసరిని కిరీటంతో సత్కరించిన రోశయ్య (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాత-మనవుడు చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావుకు యువకళావాహిని ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సత్కారం జరిగింది.

కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య దాసరికి శాలువా కప్పి కిరీటధారణతో దాసరిని ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల దీక్షతో యువకళావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంస్థను అభినందిస్తూ సంగీతంపై ఉన్న అభిమానంతో రమేష్‌నాయుడు సినీ సంగీత విభావరి నిర్వహించినందుకు సంస్థను అభినందించారు.

ROSHAIAH FELICITATES DASARI NARAYANA RAO

దాసరి నారాయణరావు మాట్లాడుతూ రమేష్‌నాయుడు సంగీతం గురించి తెలుగుగాని, ఆయన గొప్పతనాన్ని కొంతమందికే తెలుసునని, హిందీ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్-ప్యారీలాల్ రమేష్‌నాయుడు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుందని ఆయన అన్నారు. సినీ సంగీత దర్శకులలో రమేష్‌నాయుడు మించినవారు లేరు ఈ ప్రపంచంలో, రమేష్‌నాయుడు ఇచ్చిన హిట్స్ మరే సంగీత దర్శకుడు ఇవ్వలేదని దాసరి కొనియాడారు. రమేష్‌నాయుడు ఎంత నిరాడంబరుడో ఆయన పేరు ఎక్కడా వినిపించకపోవడమే అందుకు నిదర్శనం అన్నారు.

English summary
Roshaiah felicitates Dasari Narayana Rao, Program done by Yuvakalavahini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu