»   »  రోషన్ నాకు రామ్ చరణ్ తో సమానం :చిరంజీవి

రోషన్ నాకు రామ్ చరణ్ తో సమానం :చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవికి చాలా సన్నిహితంగా ఉండే వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. చిరంజీవిని శ్రీకాంత్ అన్నయ్యలా ట్రీట్ చేస్తాడు. వీరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది.శ్రీకాంత్ చిరంజీవి కి తమ్ముడి లాంటి వాడు కావడంతో అతడి కోరిక మేరకు నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని నిన్న హైదరాబాద్ లోని సినీమాక్స్ లో ప్రీమియర్ షో కి వచ్చాడు.

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు . హీరోగా నటించిన మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వాడిలా నటించాడని అలాగే శ్రియా శర్మ ను కూడా అభినందించాడు . అలాగే నాగార్జున స్పెషల్ రోల్ సినిమాని మరో మెట్టు పై నిలబెట్టిందని నిర్మలా కాన్వెంట్ యూనిట్ కు అభినందనలు అందజేశాడు చిరు . తన అభిమాన హీరో అయిన చిరంజీవి ప్రీమియర్ షోకి రావడంతో శ్రీకాంత్ సంతోషంగా ఉన్నాడు.

Roshan is like Ram Charan to me Says Chiranjeevi

రోషన్... నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన బిడ్డ. ఇంకా చెప్పాలంటే.. నాకు రామ్ చరణ్ ఎలాగో.. మిగిలిన మేనల్లుళ్లు ఎలాగో.. వారిలాగే మరొక బిడ్డ రోషన్. రోషన్ పుట్టిన దగ్గర నుంచి అర్ధమైంది ఏంటంటే ఈ కుర్రాడు బోర్న్ టు బి ఏ హీరో. హీరో మెటీరియల్ అని ముందే తెలుసు. ఈ సినిమా బాగా రోషన్ కు బాగా హెల్ప్ అవుతుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోగా రూపొందడానిక ఈ సినిమా ఉపయోగపడుతుంది' అని చెప్పిన చిరు అంతటితో ఆగలేదు.

'ఈ సినిమా విజయం అంతా హీరో హీరోయిన్ల కళ్లలోనే ఉంది. ఇలాంటి సినిమా ఆడాలి. ప్రేక్షకుల మన్నన ఆదరణ పొందాలి. అప్పుడే ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని వస్తాయి. ఆల్ ది బెస్ట్' అంటూ నిర్మలా కాన్వెంట్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. అయితే ఇదంతా ఒకేత్తయితే చిరంజీవి చేతిలో ఉన్న మొబైల్ కవర్ మాత్రం అందరినీ ఆకర్శించింది. తనయుడు రాం చరణ్ ని కౌగిలించుకున్న చిరు ఫొటోఅని తన మొబైల్ కవర్ గా పెట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధానికి ముచ్చటపడ్డారంతా...

English summary
Roshan is like Ram Charan Says Chiranjeevi at Nirmala Convent Premiere Show . and Celebs watched Nirmala Convent Premiere show Cinemax Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu