»   » ‘రౌడీ’ సినిమా పబ్లిక్ టాక్ ఏమిటి?

‘రౌడీ’ సినిమా పబ్లిక్ టాక్ ఏమిటి?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రౌడీ' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు విగ్గు లేకుండా ఒరిజినల్ గెటప్‌లో రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా కనిపించారు.

  ఎన్ని ఫ్లాఫ్స్ ఇచ్చినా సాంకేతికంగా ఉన్నతంగా ఉండే రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఎప్పుడూ క్రేజే...అందులోనూ యాక్షన్ చిత్రం, అదీ ఈ మధ్య కాలంలో ఫామ్‌లో లేని మోహన్ బాబుని ప్రధాన పాత్రలో పెట్టి అనేది అంతకు మించిన ఆసక్తికరమైన అంశం. 'రౌడీ' చిత్రం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించి సినిమాను తెరకెక్కించారు.

  ఈ చిత్రంలో మోహన్ బాబుకు జోడీగా జయసుధ, మంచు విష్ణకు జోడీగా శాన్వి నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. సినిమా మొత్తం రామ్ గోపాల్ వర్మ సినిమాల స్టైల్‌లో సాగింది. పరమ రొటీన్ అనిపించే కథ,కథనం, వర్మ పాత సినిమాల్లో కనిపించే డార్క్ మూడ్ సీన్స్ ఈచిత్రంలోనూ కనిపించాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ నడుస్తున్న వినోదానికి సినిమాలో కొంచెం కూడా స్ధానం ఇవ్వలేదు.

  సినిమాను చూసిన పలువురు వన్ ఇండియా పాఠకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు. మరి సినిమా వారికి ఎలా అనిపించిందనే విషయాలు స్లైడ్ షోలో...

  Ravi kiran ‏@kinnuPSPK

  Ravi kiran ‏@kinnuPSPK


  మోహన్ బాబుకు ఈ స్టోరీ ఎందుకు నచ్చిందో అర్థమైంది. అరగంటలో అరవై సార్లు రెస్పెక్ట్ అని అన్నాడు. మోహన్ బాబు అంకుల్ మీకు దండం.

  Bloodu ‏@roopak999

  Bloodu ‏@roopak999


  సినిమాలో డైలాగ్స్ నాకు నచ్చ లేదు.

  Nagarjuna Naidu ‏@NaiduMegaPower

  Nagarjuna Naidu ‏@NaiduMegaPower


  సోల్ మేట్.... రౌడీ చూసి ఎలా ఫీలయ్యారు? ఇండియా వచ్చేద్దామ్ అనుకుంటున్నారా మైండ్ బ్లాక్ అయి?

  Colors f Entrtainmnt ‏@RVS_TV

  Colors f Entrtainmnt ‏@RVS_TV


  మోహన్ బాబు గారు డైలాగ్స్ తోనే చూపిచారు, హాట్స్ ఆఫ్ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. తనికెళ్ల భరణి గారి డైలాగ్స్ అల్టిమేట్.

  Shooting_straight ‏@Direct_Shooter

  Shooting_straight ‏@Direct_Shooter


  ఫస్టాఫ్ ఫర్వాలేదు. కానీ సెండాఫ్‌లో ఏమీ లేదు. ఏదో రామ్ గోపాల్ వర్మకు చెందిన పాత సినిమా చూసినట్లుంది.

  Trashbag Protagonist ‏@ramkiee

  Trashbag Protagonist ‏@ramkiee


  అదిరా సీమ లెక్క...... ఈ రామ్ గోపాల్ వర్మ లెక్క ఏందో? ఏంటో?

  ConfusedIndian ‏@prem520

  ConfusedIndian ‏@prem520


  సినిమాలో ఊహించినంత లేదు. రెండు రోజులకు మించి ఆడితే సిల్వర్ జూబ్లీ చేసుకోవచ్చు.

  English summary
  Rowdy has been creating positive buzz in the media, ever since Ram Gopal Varma launched it. In addition, its promos have not only garnered great response from fans, but also soared up the movie lovers' expectations to the sky high. The movie, which has released in theatres across Telangana and Seemandhra today (April 4), will not disappoint the audience from what they have been hearing about this film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more