»   » విమల రామన్‌తో ఆర్.పి.పట్నాయక్ కామెడీ సినిమా

విమల రామన్‌తో ఆర్.పి.పట్నాయక్ కామెడీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: బ్రోకర్ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తాజాగా మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ అధినేత పుప్పాల రమేష్ ప్రొడక్షన్ నెం.4గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

విమలారామన్ ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముగ్గురు కొత్త హీరోలు, ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ..'అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో ఏకథాటిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని తెలిపారు.

దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ..'ఫుల్ లుంగ్త్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందే ఈ చిత్రం చాలా సరదాగా సాగిపోతుంది. ఎల్లో ఫ్లవర్స్ నుండి వస్తున్న ఈ ఎంటర్టెనర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: శ్రీకిరణ్, మాటలు : తిరుమల నాగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బండారి దేవేందర్, నిర్మాత్: రమేష్ పుప్పాల, స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం : ఆర్.పి.పట్నాయక్.

English summary
Music director R.P.Patnaik is all set to direct a new movie. Actress Vimala Raman will be seen in the lead role in this movie and Dialogue King Sai Kumar will be essaying a special role. This movie will be produced by Ramesh Puppala on Yellow Flowers banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu