For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎస్వీ కృష్ణారెడ్డి ‘డివోర్స్ ఇన్విటేషన్’ ఏమైంది?

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్ : ఎన్నాళ్ళుగానే ఊరిస్తున్న ఎస్.వి.కృష్ణారెడ్డి హాలీవుడ్ చిత్రం 'డివోర్స్ ఇన్విటేషన్'(Divorce Invitation)విడుదలకు సిద్దమైంది. అతి త్వరలోనే విడుదల తేదీ ఖరారు చేసి ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. దర్శకునిగా తన 19 ఏళ్ల కెరీర్‌లో 'రాజేంద్రుడు-గజేంద్రుడు' మొదలుకుని 'మస్త్' వరకూ 38 చిత్రాలు డెరైక్ట్ చేసిన ఎస్వీకె హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో ఆయన హాలీవుడ్‌లో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

  గత రెండు మూడు సంవత్సరాలుగా ఎస్వీ కృష్ణా రెడ్డి ఈ సినిమా నిర్మాణంలోనే తలమునకలై ఉన్నారు. తెలుగులో హంగామా, సామాన్యుడు, డాన్ శీను, బిజినెస్ మేన్ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ ఈ 'డివోర్స్ ఇన్విటేషన్'ను నిర్మించడం విశేషం. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈచిత్రంలో అందరూ హాలీవుడ్ నటులే నటించారు. ఇప్పటికే 38 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న ఎస్.వి.కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఏకంగా హాలీవుడ్ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఈచిత్రానికి గాను ఆయన బాలారాజశేఖరునితో కలిసి స్ర్కిప్టు వర్క్ చేశారు.

  ఏడాదికి మూడు ఆంగ్ల చిత్రాలు నిర్మించాలనే తలంపుతో ఉన్న నిర్మాత వెంకట్ ఈ 'డివోర్స్ ఇన్విటేషన్'తో అందుకు శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రసిద్దార్థ్, ఆర్పీ పట్నాయక్ వంటి దర్శకులు కూడా ఆంగ్ల భాషలో చిత్రాలు నిర్మించారు. అయితే ఇంతటి భారీస్థాయిలో ఓ తెలుగు దర్శకుడు ఆంగ్ల చిత్రం చేయడం మాత్రం ఇదే ప్రథమం. 2009లో 'మస్త్' చిత్రం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి ఈ ప్రాజెక్ట్‌లోనే నిమగ్నమై ఉన్నారు.

  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'డివోర్స్ ఇన్విటేషన్' అంటే విడాకుల ఆహ్వాన పత్రిక. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి ఇదే కాన్సెప్ట్ మీద తెలుగులో 'ఆహ్వానం' చిత్రాన్ని తీశారు. మరి ఇంగ్లిష్ సినిమా ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. జోనాథన్ బెన్నెట్, జేమీలిన్ సింగ్లార్, నాడియా జోర్లిన్, ఎలియట్ గౌల్డ్, వెయినీ కజన్, పాల్ సార్వినో, రిచర్డ్ కైండ్, కీత్ రాబిన్‌సన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: బ్రాడ్ రషింగ్, సంగీతం: వెన్నీ స్టెప్‌బన్, ఎడ్ బార్గురెనా, కౌత్ రాబిన్‌సన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌స్యూర్, ఎస్‌ఏ హమీద్, సహ నిర్మాత: ఎంఎస్‌పీ.శ్రీనివాసరెడ్డి, రచన, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

  English summary
  RR Movie Makers (India), a leading production and distribution company headquartered in India, has started a U.S. based film financing and production outfit RR MovieMakers, LLC. Its first project, “DIVORCE INVITATION”, is a romantic comedy staring Jonathan Bennett, Jamie-Lynn Sigler, Nadia Bjorlin, Elliott Gould, Lainie Kazan, Paul Sorvino, Richard Kind, Keith Robinson, and Andrea Bowen. "Divorce Invitation" is directed by critically acclaimed and award-winning director S.V. Krishna Reddy, who also wrote the story & screenplay. Dr. Venkat, a leading producer in the Indian film industry, who has produced more than 13 blockbuster films in India over the past nine years, will produce with Ram Sure serving as an executive producer & M.S.P. Srinivas Reddy as co-producer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X