»   » ఆర్.ఆర్.మూవీస్ వెంకట్‌కు రెండు అవార్డులు

ఆర్.ఆర్.మూవీస్ వెంకట్‌కు రెండు అవార్డులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత డా.వెంకట్‌ను ఇండో నేపాల్ ఫ్రెండ్‌షిప్ అవార్డు, ఇండో నేపాల్ రతన్ అవార్డు దక్కించుకున్నాడు. వెంకట్ తన ప్రతి చిత్రం ఆడియో విడుదల రోజున స్వచ్ఛంద సంస్థలకు, వికలాంగులకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. రహదారి సరిగాలేని పెదమాంద్యం మండల్‌లోని మారుమూల తండాల్లోని ప్రజలకు తన వంతు సాయం చేయడంతో పాటు చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలంలో జంతువలు కోసం నీళ్ళ తొట్టెలను ఏర్పాటు చేశారు. అనేక మందికి అనేక రకాలుగా సాయం అందిస్తూ వస్తున్నారు

ఈ సేవలను గురించి తెలుసుకున్న ఎకనమిత్ గ్రోత్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డులను ప్రకటించింది. డా.వెంకట్ అందుబాటులో లేక పోవడంతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సహ నిర్మాత వి.సురేష్‌రెడ్డి అవార్డులను నేపాల్ ఫ్రెండ్‌షిప్ అవార్డును నేపాల్ ప్రెసిడెంట్ రామ్‌బరన్ యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు. గతంలోనూ వెంకట్ కు అనేక సేవా అవార్డులు లభించాయి.

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నుంచి కిక్, డాన్ శీను, ప్రేమ కావాలి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం కృష్ణ వంశీ, నాని కాంబినేషన్ లో ఓ యాక్షన్ సినిమా కామెడీ సినిమాను ప్లాన్ చేస్తున్నారు ఆర్.ఆర్. మూవీ మేకర్స్.

English summary
RR Movies Venkat has received two indo-nepal Friendship Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu