For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR : హిందీ మార్కెట్ మీద జక్కన్న కన్ను.. స్పెషల్ టూర్స్ తో పాటు మరో కీలక అడుగు.. ఇక రికార్డులు బద్దలే!

  |

  దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో, ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు అని అందరూ చెబుతుంటారు. అందుకే బాహుబలి లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించిన ఆయన బాహుబలి 2 సినిమా కోసం కేవలం కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే ఒక చిన్న సస్పెన్స్ ఉంచి ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిపాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక RRR సినిమా కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి తనదైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  దాఖలాలు ఎక్కడా లేవు

  దాఖలాలు ఎక్కడా లేవు


  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం RRR. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రకని, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ లాంటి అనేక ఇతర స్టార్లు ఈ సినిమాలో భాగమయ్యారు. తెలంగాణకు చెందిన కొమరం భీమ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామరాజు అనే ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలుసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.

   నాలుగేళ్ల తరువాత

  నాలుగేళ్ల తరువాత


  కానీ వారు కలుసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక కల్పిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డి.వి.వి.దానయ్య ఈ సినిమాకు దాదాపు 450 కోట్ల రూపాయలు వెచ్చించారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. బాహుబలికి పనిచేసిన టీమ్ అంతా కూడా ఈ సినిమాకి మరోసారి పని చేసింది. 2018 సంవత్సరంలో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు అలా ప్రకటించిన తర్వాత దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

   సమానంగా హిందీ మార్కెట్

  సమానంగా హిందీ మార్కెట్


  ఈ సినిమాను కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెట్టిన డబ్బులు నిర్మాతకు వచ్చేశాయి కానీ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు ఏ మాత్రం నష్టం కలగకూడదనే ఉద్దేశంతో రాజమౌళి దుబాయ్ మొదలు భారత దేశం అంతా తిరిగి సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎంత ఉంటుందో దానికి సమానంగా హిందీ మార్కెట్ కూడా ఉంటుంది.

   ప్రీమియర్ షో

  ప్రీమియర్ షో


  పుష్ప సినిమా విషయంలో ఒక రకంగా సినిమాను హిట్ గా నిలబెట్టింది హిందీ బెల్ట్ అనే చెప్పాలి.. ఈ నేపధ్యంలోనే హిందీ మార్కెట్ మీద జక్కన్న ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు మీడియాకు ప్రీమియర్ షో వేస్తున్నారో లేదో అనే దానిమీద ఇంకా సమాచారం లేదు కానీ 24 వ తేదీ రాత్రి 9:30 గంటలకు ముంబైలో ఒక స్పెషల్ ప్రీమియర్ వేయబోతున్నారు అని తెలుస్తోంది.

  Recommended Video

  Kannadigas Angry With RRR Movie..తప్పెవరిది ? | RRR Vs KGF 2 | Filmibeat Telugu
  జక్కన్న ప్లాన్

  జక్కన్న ప్లాన్


  బాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులతో పాటు పాత్రికేయులకు కూడా సినిమా చూపించడానికి జక్కన్న ప్లాన్ చేశారని తెలుస్తోంది.. ఖచ్చితంగా చూసిన వారు సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాత్రికేయులు అయితే తమ తమ వెబ్సైట్స్ ద్వారా రివ్యూలు పోస్ట్ చేస్తారు. తద్వారా హిందీ మార్కెట్లో సినిమాను మరింత తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని జక్కన్న భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  as per news in social media, RRR's first premiere is to be premiered on 24th March at 9.30 PM in Mumbai for Celebrities and Press.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X