Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
RRR మరో దేశంలో.. బాహుబలి సూపర్ హిట్టైన దేశంలో విడుదల తేదీ ఖరారు!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసిన ప్రతీ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ఎల్లలు దాటించిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో మరోసారి మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పటికే మన దేశం సహా పలు దేశాలలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ ఇక జపాన్లో సందడి చేయనుంది. ఆ వివరాలు

మ్యాజికల్ బ్లాక్ బస్టర్
ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా మార్చి 24న విడుదలైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ఆపసోపాలు పడిన సంగతి తెలిసిందే. పలుమార్లు విడుదల చేస్తామని చెప్పి వాయిదాలు వేసిన అనంతరం ఎట్టకేలకు మార్చి 24న ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏదైతేనేం సినిమా మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

విడుదల చేయబోతున్నట్టు
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే... ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరో ముప్పై దేశాల్లో విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎంతో ఆసక్తిగా
అయితే ఆ రిలీజ్ డేట్స్ ఎప్పుడు అన్నది తనకు తెలియదని అప్పట్లోనే ఈ స్టార్ హీరోలు స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ సినిమాను జపాన్లో విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. అక్టోబర్ 21న సినిమాను జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో జపాన్ లోని రాజమౌళి అభిమానులతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభినయంతో
మరి ఈ సినిమాకు అక్కడ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీముడుగా, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో కనిపించగా, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ మరో హీరోయిన్ గా తన అభినయంతో ఆకట్టుకుంది.

పాన్ ఇండియా స్టార్లుగా
ఇక కీరవాణి సైతం తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. ఇదిలా ఉండగా తమ అభిమాన హీరోల సినిమా విదేశాల్లో సైతం విడుదల తాగుతూ ఉండడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాగా, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ వరుస పెట్టి డిఫరెంట్ కాన్సెప్టులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వీరి బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఏదీ ఖరారు కాలేదు.