For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBDSSRajamouli.. అలా సావగొడతాడంటోన్న ఎన్టీఆర్.. RRR టీం బాధలు వర్ణనాతీతం!

  |

  దర్శక ధీరుడు రాజమౌళికి జక్కన అనే ఓ బిరుదు ఉండనే ఉంది. కొందరు పని రాక్షసుడు అని అంటారు. అయితే ఆయన తన టీం మేట్స్‌ను ఎంతలా హింసిస్తాడో.. ఎంతలా బాధపెడుతున్నాడో ఓ వీడియో ద్వారా చెప్పారు. నేడు (అక్టోబర్ 10) రాజమౌళి పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం తన బాధలను బయటకు కక్కింది. ఒక్కొక్కరిని రాజమౌళి ఎలా హింసిస్తాడో పూస గుచ్చినట్టు వివరించారు.

  ఇంటి డాబాపై

  ఇంటి డాబాపై


  మొదటగా కో డైరెక్టర్ త్రికోటి మాట్లాడుతూ..విక్రమార్కుడు సినిమా నుంచి స్టోరీ డిస్కషన్‌లో ఉంటున్నాను.. మామూలుగా ఆఫీస్‌లోనో ఇంట్లోనో పెడుతుంటాడు.. అందరూ మలేషియా, బ్యాంకాక్‌లో సిట్టింగ్ పెడుతుంటారు.. మనం కూడా అలా బయటపెడదాం అని అంటుంటాను. అర్ఆర్ఆర్ కోసం మలేషియా వెళ్దామన్నాడు కానీ చివరకు ఇంటి డాబాపైకి తీసుకెళ్లాడు. కనీసం ఈసారైనా బయటకు తీసుకెళ్లండి అని తన బాధను వెల్లడించాడు.

  అడిగే వరకు చూపించవా

  అడిగే వరకు చూపించవా


  అసిస్టెంట్ డైరెక్టర్ నాగార్జున మాట్లాడుతూ.. రాజమౌళికి ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చెప్పుకొచ్చాడు. నేను ఏదో చూపిద్దామని వస్తే తర్వాత తర్వాత అంటారు.. సర్లే బిజీగా ఉన్నారు కదా అని అనుకుంటే.. ఏం అయ్యా.. అడిగే వరకు చూపించవా అంటారు..మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం సార్ అని తన గోడును బయటపెట్టాడు.

   బ్లూ మ్యాట్ వేసి చేసేద్దాం

  బ్లూ మ్యాట్ వేసి చేసేద్దాం

  అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ లొకేషన్స్ కోసం జక్కన్న ఎలా విసిగిస్తాడో చెప్పాడు. ఓ సీన్ గురించి చెప్పాక లొకేషన్‌ వెతికి ఫోటోలు పంపిస్తే.. ఊరికే ఫోటోల్లో ఎలా తెలుస్తుందని అంటాడు.. సరే కదా అని మనిషిని పెట్టి పంపింతే.. చుట్టూ పక్కలా ఏముందో ఎలా తెలుస్తుందంటాడు.. సర్లే అని వీడియో పంపింతే.. అది కూడా సరిగ్గా తీయడం రాదా అంటూ ఫైర్ అవుతాడు. అన్నీ సరిగ్గా చేసి పంపితే అది వద్దు బ్లూ మ్యాట్ వేసి చేసేద్దాం అంటాడని చెప్పుకొచ్చాడు.

  గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా

  గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా


  ఆర్ట్ డిజైనర్ సాబూ సరిల్ మాట్లాడుతూ.. ఆయనెప్పుడూ ఏదో లోకంలో ఉంటాడు. ఒక్కోసారి కదిలిస్తే గానీ మన లోకంలోకి రాడు.. గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా ఏదో లోకం ఉంటాడు.. మళ్లీ కదిలిస్తే హా ఏంటి అని ఈ లోకంలోకి వస్తాడు. అందుకే ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా భయమేస్తుందని తెలిపాడు. కీరవాణి మాట్లాడుతూ.. పల్లవి ఎప్పుడో రాయిస్తాడు.. మళ్లీ ఎప్పుడో చరణం రాయమంటాడు.. ట్యూన్, మిక్సింగ్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎప్పుడో ఐదారు నెలల తరువాత అడుగుతాడు. మొత్తం ఇంట్రెస్ట్ పోతుందని తన బాధను వివరించాడు.

  MAA Passes New Rule, Actors Remuneration To Be Reduced By 20 Percent | Filmibeat Telugu

  ఎన్టీఆర్, రామ్ చరణ్ అలా..

  సరిగ్గా లంచ్ టైం అనే ముందో లేదా ప్యాక్ అప్ చెప్పే ముందో ఓ సీన్ గుర్తుకు వస్తుంది.. అది మన జక్కన్నకు ఓ పట్టాన నచ్చదు.. ఒక్క షాట్ కోసం ఐదారు గంటలు సావగొడతాడు.. ఆకలి మీద కోరిక కూడా చచ్చిపోతుందని ఎన్టీఆర్ అన్నాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. రిస్కీ ఫైట్ నలభై ఫీట్ల దూరం నుంచి జంప్ రోలింగ్ అంటాడు.. చాలా బాగుందని నేను కూడా అంటాను ఎవరు సర్ చేసేది అంటే.. ఇంకెవరు నువ్వే అని అంటాడు. అంతకుముందు దాని కోసం అంతా ప్రిపేర్ చేసుకుని ఉంటాడు..ఇక ఆయన ఓకే అన్నాక మనం కాదంటామా అని తన బాధను బయటకు చెప్పాడు.

  English summary
  RRR Team Special Complaints Video On Rajamouli,A small gift from team #RRRMovie to the man who only loves to give us all cinematic thrills in the form of elevations and emotions, but is against anyone giving him birthday wishes!,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X