»   »  రూ. 100 కోట్ల విడాకుల డీల్...హృతిక్ రోషన్ భార్య స్పందన

రూ. 100 కోట్ల విడాకుల డీల్...హృతిక్ రోషన్ భార్య స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
n
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సుజానె రోషన్ విడిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లు అన్యోన్యంగా కాపురం సాగించిన వీరిద్దరూ....కలిసి జీవించడం తమ వల్ల కాదనే నిర్ణయానికి వచ్చారు. విడాకులు తీసుకోబోతున్నట్లు మీడియా ప్రకటన సైతం చేసారు.

కాగా....ఈ పరిణామాల నేపథ్యంలో హృతిక్ రోషన్ తన భార్యకు రూ. 100 కోట్ల విడాకులు సెటిల్మెంట్ కింద చెల్లించనున్నాడనే వార్తలు బాలీవుడ్లో ఊపందుకున్నాయి. భర్త ఆస్తిలో భార్యకు వాటా లభిస్తుంది కాబట్టి ఈ మేరకు ఈ డీల్ ఓకే అయినట్లు జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మనస్థాపం చెందిన సుజానె రోషన్....మీడియా తీరుపై ఫైర్ అయ్యారు. 100 కోట్ల డైవర్స్ సెటిల్మెంట్ అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇది పూర్తిగా ఆధారం లేని వార్తలే అని ఆమె తేల్చి చెప్పారు. ఈ వార్తలు తనను ఎంతో బాధించాయని ఆమె చెప్పుకొచ్చారు.

చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. 'సుజానె నా నుండి విడిపోవాలని కోరుకుంటోంది, నాతో ఉన్న 17 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటోంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది చాలా కఠినమైన సమయం. మా ప్రైవసీకి కేటాయించాలని మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను' అంటూ 39 ఏళ్ల హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు.

English summary
Sussanne Roshan Saturday denied a media reports saying her divorce from Hindi movie star Hrithik Roshan is a Rs.100 crore settlement and said that its unethical to publish such false news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu