»   » హాలీవుడ్ స్థాయిలో మహేశ్ ఫైట్స్.. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా..

హాలీవుడ్ స్థాయిలో మహేశ్ ఫైట్స్.. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా..

Written By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రిన్స్ మహేశ్ వియత్నాంకు చేరుకొన్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఛేజింగ్ సీన్లను దాదాపు రూ.3 కోట్లతో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇంత భారీ మొత్తంలో యాక్షన్ సీన్లను చిత్రీకరించడం భారతీయ సినిమా పరిశ్రమలో ఇదే తొలిసారి అనే మాట వినిపిస్తున్నది.

Maheshbabu

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ మహేశ్ బాబు సినీ అభిమానులకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఈ ఉగాది సుఖ:సంతోషాలను నింపాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

80 శాతం సినిమా షూటింగ్

80 శాతం సినిమా షూటింగ్

ఈ చిత్రానికి సంభవామి, ఏజెంట్ గోపి అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో కీలకమైన యాక్షన్ పార్ట్‌ను వియత్నంలో రెండు వారాలపాటు చిత్రీకరించనున్నారు.

వియత్నాంలో రెండోసారి

వియత్నాంలో రెండోసారి

వియత్నాంలో దక్షిణాది చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు జయం రవి నటించిన వనమాగన్ చిత్రాన్ని వియత్నాంలో షూట్ చేశారు. గతంలో కనీవిని ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లను షూట్ చేయనున్నాం. ఇందులో ప్రధానంగా ఛేజింగ్ సీన్ చాలా ముఖ్యమైనది. హాలీవుడ్ స్ఠాయికి తగినట్టు ఫైట్స్‌ను కంపోజ్ చేయనున్నాం. వియత్నాంకు
చెందిన ఫైట్ మాస్టర్ యాక్షన్ సీన్లను డైరెక్షన్ చేస్తున్నారు. ఏప్రిల్ రెండోవారంలో యూనిట్ తిరిగి వస్తుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

జూన్ 23న విడుదల

జూన్ 23న విడుదల

మహేశ్ బాబు ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నది. ఖుషీ దర్శకుడు సూర్య విలన్‌గా కనిపిస్తారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 23న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్నది.

English summary
Murugadoss, currently in Vietnam for the shoot of his next film with Mahesh Babu, has apparently spent a whopping Rs 3 crore on a grand chase sequence alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu