»   » ‘మహానుభావుడు’...ఆ సినిమాకు కాపీనా? మారుతి రియాక్షన్ ఇలా...

‘మహానుభావుడు’...ఆ సినిమాకు కాపీనా? మారుతి రియాక్షన్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahanubhavudu Copied From Malayalam Film ‘మహానుభావుడు’.ఆ సినిమాకు కాపీనా?

శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో హీరో అతిశుభ్రత అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్‌కు లవ్ స్టోరీ జోడించి, కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు.

కాపీ రూమర్స్

కాపీ రూమర్స్

ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. మలయాళంలో వచ్చిన 'నార్త్ 24 కాథమ్' అనే మూవీ కథను కాపీ కొట్టి ‘మహానుభావుడు' సినిమా చేశారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఫాహద్ ఫాజిల్, స్వాతి రెడ్డి చేసిన ఈ చిత్రం 2013లో మలయాళంలో మంచి హిట్టయింది.

రూమర్లపై మారుతి రియాక్షన్ ఇలా

రూమర్లపై మారుతి రియాక్షన్ ఇలా

కాపీ రూమర్లపై దర్శకుడు మారుతి స్పందించారు. అతిశుభ్రత అనే కథాంశంతో ఆయా భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయనీ, అంత మాత్రాన వాటిని కాపీ కొట్టి ‘మహానుభావుడు' తీశామనుకోవడం సరికాదని, ఏ సినిమాతోను తమ సినిమాకు పోలిక ఉండదన్నారు.

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ ఇలా

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ ఇలా

``మ‌హానుభావుడు చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే మ‌ధ్యలో హాలీడేస్ రావడంతో వ‌ద్ద‌ని అనుకున్నాం. ద‌స‌రా పండ‌గ‌కి ఇలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా వ‌స్తే బావుంటుంద‌ని నిర్మాత‌లు అన‌డంతో సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.

ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మూవీ

ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మూవీ

చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ కుటుంబం అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను చేయ‌లేదు. ఇలాంటి స్క్రిప్ట్ మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని అనుకోవ‌డం లేదు... అని శర్వానంద్ తెలిపారు.

మహానుభావుడు

మహానుభావుడు

ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె ముఖ్య పాత్రలు

ట్రైలర్

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి

English summary
Sharwanand's "Mahanubhavudu" film released and impressed audiences. A man obsessed with cleanliness finally gets his hands dirty and gets rid of his disorder, that's the single-line story of Mahanubhavudu. And that is the story of another Malayalam film "North 24 Kaatham" that has featured Fahad Fazil and Telugu girl Colors Swathi in the leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu