»   » మార్పుకు కారణం పవన్ కళ్యాణ్ కాదట!

మార్పుకు కారణం పవన్ కళ్యాణ్ కాదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మెగా ఫ్యామిలీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఏదో ఒకరకంగా ఎక్స్‌పోజ్ అవడం ఈ మధ్య కామన్ అయిపోయింది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాల్లోకి రాబోతున్నాడు అనే వార్త వెలుగులోకి వచ్చిందే ఆలస్యం.....పవన్ కళ్యాణ్ వరుణ్ ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, కథ, దర్శకుడు లాంటి ముఖ్య మైన విషయాలపై పవన్ కళ్యాణ్‌దే ఫైనల్ డెసిషన్ అని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.

ఇటీవల వరుణ్ తేజ్ తెరంగ్రేటం చేయబోయే సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథ్ అనుకున్నప్పటికీ తర్వాత క్రిష్‌ను ఫైనల్ చేసారు. ఈ మార్పు వెనక పవన్ కళ్యాణ్ కారణమని, పవన్‌పై పూరి జగన్నాథ్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యల ఫలితమే అనే పుకార్లు షికార్లు చేసాయి.

అయితే తాజాగా తేలింది ఏమిటంటే.....పూరిని మార్చడం వెనక పవన్ కళ్యాణ్ ప్రమేయం లేదని తెలుస్తోంది. వేరే కారణాల వల్లనే పూరిని మార్చి క్రిష్‌ను ఎంపిక చేసారని అంటున్నారు. ఈ మార్పు వెనక కారణం వరుణ్ తేజ్‌ను వెండి తెరకు పరిచయం చేయబోయే నిర్మాత అశ్వినీ దత్ అనే అంటున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే....దర్శకుడు క్రిష్‌ ఇప్పటి వరకు తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ హిట్స్ ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో మరి వరుణ్ తేజను క్రిష్ ఎలాంటి కథాంశంతో లాంచ్ చేయబోతున్నారో? అనేది ఆసక్తికరంగా మారింది.

English summary

 Recently there are lots of rumors that Nagababu rejected Puri as his son’s debut director Puri only because of Pawan. But it seems to be these rumours are all fake, Pawan never intervened in this matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu