»   » దాసరి ‘నేరం’ చేయకుండా ఎస్కేప్, ఇపుడు వీరు చేసారు!

దాసరి ‘నేరం’ చేయకుండా ఎస్కేప్, ఇపుడు వీరు చేసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్‌ కిషన్‌, అనీషా అంబ్రోస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్‌'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.

టైం బాగోక వెళ్తే...తప్పదు బయిటకు 'రన్‌' (రివ్యూ )
వాస్తవానికి ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు చేయాలనుకున్నారు. తమిళ వెర్షన్ 'నేరం' హ‌క్కుల్ని కొని రెండేళ్లు త‌న ద‌గ్గ‌రే ఉంచుకొన్నారు. త‌న‌యుడు అరుణ్‌బాబుతో ఆ సినిమా తీయాల‌ని, కొడుక్కి ఓ హిట్టివ్వాల‌ని ప్లాన్ చేసారు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా తెరకెక్కలేదు. నేరం సినిమా హక్కులు దాసరి వద్ద నుండి కొనుగోలు చేసి మరీ 'రన్' పేరుతో తీసారు.

Run movie avarage talk

'రన్' చిత్రం నిన్న విడుదలై బాక్సాఫీసు వద్ద బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాసరి అపుడు 'నేరం' చేయనిదే నయం అయిందని 'రన్' రిజల్ట్ చూసిన వారంటున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అయ్యేట్లు కనిపించడం లేదని ట్రేడ్ విశ్లేషకుల టాక్.

గుడ్ టైం, బ్యాడ్ టైం అంటూ రెండు ఉంటాయంటూ, ఏ టైమ్ అవుతున్నప్పుడు ఎలా మనుష్యులు ఉంటారో చెప్తూ 'రన్' సినిమా తీసారు. ఒక్క రోజులో జరిగే ఈ కథ,కథనం నత్త నడక నడవటంతో ఓ సంవత్సరం ధియోటర్ లో గడిపిన ఫీల్ కలగచేస్తుంది. అంతేనా సందీఫ్ కిషన్ సినిమా కదా అని కాస్త ఫన్ ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తే...అది మేం ఇవ్వం మొహం మీద చెప్పినట్లు సినిమాను డ్రై గా నడిపారు.

English summary
Actor Sundeep Kishan, who is going loaded with his career is coming with a remake of Malayalam-Tamil bilingual Neram. As compared to Neram, Run is a mediocre remake. If you have seen Neram, you don’t like this Run.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu