»   » టైం బాగోక వెళ్తే...తప్పదు బయిటకు 'రన్‌' (రివ్యూ )

టైం బాగోక వెళ్తే...తప్పదు బయిటకు 'రన్‌' (రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5
గుడ్ టైం, బ్యాడ్ టైం అంటూ రెండు ఉంటాయంటూ, ఏ టైమ్ రన్ అవుతున్నప్పుడు ఎలా మనుష్యులు ఉంటారో చెప్తూ రన్ సినిమా వచ్చింది. ఒక్క రోజులో జరిగే ఈ కథ,కథనం నత్త నడక నడవటంతో ఓ సంవత్సరం ధియోటర్ లో గడిపిన ఫీల్ కలగచేస్తుంది. అంతేనా సందీఫ్ కిషన్ సినిమా కదా అని కాస్త ఫన్ ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తే...అది మేం ఇవ్వం మొహం మీద చెప్పినట్లు సినిమాను డ్రై గా నడిపారు.

అక్కడక్కడా పంచ్ లు వేసినా, అవి మనకు భాక్సింగ్ పంచ్ ఇచ్చినట్లు తగులుతూంటాయి. కెమెరా వర్క్ తప్పించి ఈ సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. మళాయళి, లేదా తమిళ నేరం వెర్షన్ చూసిన వారు తెలుగులో ఎలా దీన్ని చేసారో అని చూడ్డానికి మాత్రమే పనికి వచ్చేలా తయారైంది. అలా ఈ రన్..ప్రేక్షకుడుని ధియోటర్ లోంచి బయిటకు రన్ చేసేలా చేసింది.

కథ ఏంటంటే...సాప్ట్ వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న సంజూ అలియాస్ సంజయ్ (సందీప్‌ కిషన్‌)కి తన చెల్లి పెళ్లి కోసం తప్పని పరిస్థితుల్లో వడ్డీ రాజా (బాబి సింహా) దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకొంటాడు. వాడేమో అచ్చ తెలుగు విలన్ . వడ్డీ దగ్గర కానీ, అసలు దగ్గర కానీ తేడా వస్తే లక్ష కోసం కూడా ప్రాణాలు తీసేసే రకం. మన హీరో మొదటి రెండు నెలలూ వడ్డీ బాగానే కట్టేస్తాడు..కానీ మూడో నెల నుంచి వడ్డీ కట్టలేని పరిస్దితుల్లో పడతాడు.

ఆ రోజు..నాలుగో నెల వడ్డీ చెల్లించే రోజు.. సాయింత్రం ఐదు గంటలు లోపు అసలు,వడ్డీ కట్టేయాలి. ఫ్రెండ్ దగ్గర అప్పు (అదేదో ముందే చేయచ్చుగా అనకండి)తీసుకుని బయిలుదేరతాడు. కానీ వీడి దరిద్రం వీడితో పోటి పెట్టుకోవటంతో ఆ డబ్బుని ఓ దొంగ కొట్టేస్తాడు..మరో ప్రక్క వడ్డీ రాజా ..మనోడి గర్ల్ ఫ్రెండ్ అమూల్య (అనీషా) ని కిడ్నాప్ చేస్తాడు. సంజూ కోసం ఆమె ఇంట్లోనుంచి పారిపోయి వస్తుంది.

ఆ కిడ్నాప్ కేసు కూడా మన హీరో మీద పడటంతో పోలీసులు గాలిస్తూంటారు. ఇక్కడితో సమస్యలు చాలవా అనుకుంటే...కట్నం మరో లక్ష కావాలని పట్టుపడతారు పెళ్లి చేసుకున్న బావగాడు. మరి ఇన్ని సమస్యలను హీరో ఎలా సాయింత్రం ఐదు లోపు పరిష్కరించుకున్నాడు... ఏం జరిగింది ..అనేది తెరపై చూడాల్సిన కథ.

ఇక ఒక సినిమాను రీమేక్ చేయటానికి కేవలం అక్కడ హిట్టైందనే ట్యాగ్ మాత్రమే సరిపోదని చాలా సార్లు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. అయితే సేఫ్ బెట్టింగ్ అంటూ నిర్మాతలు ఈ గేమ్ ఆడుతూనే ఉన్నారు.

ముఖ్యంగా హిట్ సినిమా రీమేక్ రైట్స్ తెస్తే హీరోలు డేట్స్ ఉత్సాహంగా ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ అక్కడలాగే ఇక్కడ కూడా ఆడేస్తుందనే కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకుని కొనేస్తారు అనే కాన్సెప్టే నిర్మాతలను ఈ రీమేక్ ల వైపు నడిపిస్తుంది. అదే ఇక్కడా జరిగిందేమో అనే సందేహం వస్తుంది ఈ సినిమా చూస్తుంటే.

కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాతో నడిచే ఈ సినిమా నిర్మాతకు బడ్జెట్ కంట్రోలు అనే ఉత్సాహాన్ని ఇస్తుందేమో కానీ ప్రేక్షకుడుకి మాత్రం ఇలా ఉందేంటి ఈ సినిమా అనిపిస్తుంది.

మిగతా రివ్యూ స్లైడ్ షోలో ...

ఒరిజనల్ లో

ఒరిజనల్ లో

ఈ సినిమాని యాజిటీజ్ ఒరిజనల్ ని అనుసరిస్తూ దింపేసారు కానీ..ఒరిజనల్ లో ఉన్న ఫీల్ ని మాత్రం తీసుకురాలేకపోయారు.

మేజర్ ప్లస్

మేజర్ ప్లస్

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ లెంగ్త్ అని చెప్పవచ్చు. అది ఈ సినిమా చూసిన వారికి రిలీఫ్ ఇచ్చే అంశం.

ఉన్నంతలో

ఉన్నంతలో


పోలీసాఫీసర్‌గా బ్రహ్మాజీ, పొలిటికల్ లీడర్‌గా పోసాని అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

పెద్ద మైనస్

పెద్ద మైనస్

సినిమాకు కీలకంగా నిలవాల్సిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చుట్టేసినట్లు ఉండటం, తేల్చేయటం.

సబ్ ప్లాట్స్ లేవు

సబ్ ప్లాట్స్ లేవు

హీరో తన టార్గెట్‌ ఎలా రీచ్‌ అవుతాడు అన్న సింగిల్‌ పాయింట్‌పైనే సినిమా నడుస్తుంది. ఒక్క పాయింట్‌ మీద రెండు గంటల కథ నడపడం కష్టం.. చూడ్డం మరింత కష్టం. దాంతో రన్‌.. ప్రతి క్షణం భారంగా అనిపిస్తుంది

హీరో చేయటానికి ఏమీ లేదు

హీరో చేయటానికి ఏమీ లేదు

ఇది కేవలం డైరక్టర్ పాయింటాఫ్ వ్యూ కథ. హీరో చేయటానికి ఏమీ ఉండదు..సమస్యలను అనుభవించటం తప్పు. అదే ఊరూ పేరులేని హీరో అయితే అతనుంచి ఏమి ఆశించటం కాబట్టి ప్లాబ్లం అనిపించదు.

ధ్రిల్స్ లేవు

ధ్రిల్స్ లేవు

కథ చాలా వరకూ చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది. పెద్దగా ధ్రిల్లింగ్ ఎక్కడా అనిపించదు.

ఎవరెవరు...

ఎవరెవరు...

చిత్రం: రన్‌
నటీనటులు: సందీప్‌ కిషన్, అనీషా ఆంబ్రోస్,బాబి ,మహత్‌ రాఘవేంద్ర, కాశీ విశ్వనాథ్‌, బ్రహ్మాజీ, మధునందన్‌ తదితరులు.
సంగీతం: సాయి కార్తీక్‌,
ఎడిటింగ్: ఎం.ఆర్‌.వర్మ,
ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌,
నిర్మాణం: ఏకె ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌,
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి,
దర్శకత్వం: అని కన్నెగంటి
విడుదల తేదీ: 23 మార్చి 2016


ఫైనల్ గా రన్ సినిమా ట్రైలర్స్ చూసి ఏదో ఉందని ఎక్సపెక్ట్ చేసి వెళ్తే ఏమీ లేదని అర్దమవుతుంది. సందీప్ కిషన్ కొత్త తరహా సినిమాలు చేస్తున్నారనుకుండున్నాడు కానీ... తమిళ ఆలోచనలు, మళయాళ రీమేక్ లతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమాలు మాత్రం చేయటం లేదని మరో సారి ప్రూవ్ చేస్తుందీ సినిమా.

English summary
Sundeep kishan's Run movie released today with divide talk. "Run" is an official remake of Malayalam movie "Neram," which was simultaneously made and released in Tamil with the same name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu