»   » ఆగష్టు 1న శర్వానంద్ ‘రన్ రాజా రన్’ విడుదల

ఆగష్టు 1న శర్వానంద్ ‘రన్ రాజా రన్’ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన తొలి ప్రయత్నం 'మిర్చి'తో సూపర్ డూపర్ హిట్‌ని సాధించిన నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న చిత్రం 'రన్ రాజా రన్'. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది.

లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. 'విశ్వరూపం 2' చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘిబ్రాన్.యం చక్కటి సంగీతాన్ని అందించారు. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'మిర్చి'కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మధి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మాట్లాడుతూ ''యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా రన్ రాజా రన్ చిత్రాన్ని తెరకెక్కించాం. దర్శకుడు సుజిత్ చెప్పిన కథ, కథనం మాకు నచ్చి ఈ చిత్రాన్ని చేసాం. ఈ చిత్రం తరువాత సుజిత్ దర్శకుడిగా స్థిరపడతాడు. శర్వానంద్ నటన మరోసారి అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కథనం సూపర్బ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీలవుతారు. వినూత్నంగా లవ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటూ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది'' అన్నారు.

Run Raja Run shifted to August 1

తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మధి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఘిబ్రాన్ అందించిన సంగీతానికి మంచి స్పందన రావడం.. సినిమా ఫలితంపై మా నమ్మకాన్ని మరింత పెంచినట్లయ్యింది. యు/ఎ సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తియింది. ఆగష్టు1న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. శర్వానంద్ అభిమానులనే కాక యావత్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందీ చిత్రం' అన్నారు.

నటీనట వర్గం: శర్వానంద్, సీరత్ కపూర్, అడవి శేషు, సంపత్, జయప్రకాష్ రెడ్డి, అలి, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు. సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: మధి, సంగీతం: ఘిబ్రాన్.యం, ఎడిటర్: మధు, ఆర్ట్: ఏ.యస్. ప్రకాష్, పి.ఆర్.ఓ: ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్, నిర్మాతలు: వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: సుజిత్.

English summary
Sharwanand's upcoming film Run Raja Run directed by newcomer Sujeeth and featuring actress Seerat Kapoor will now release on 1st August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu