»   » కమెడియన్ కామెంట్: దీపిక పదుకోన్‌‌ను పెళ్లాడేవాడట!

కమెడియన్ కామెంట్: దీపిక పదుకోన్‌‌ను పెళ్లాడేవాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ కమెడియన్, యాక్టర్, రేడియో హోస్ట్ రస్సెల్ బ్రాండ్ ఇటీవల బెంగుళూరులో జరిగిన కామెడీ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. రస్సెల్ బ్రాండ్ ఇండియాలో తన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ గురించి...నేను ఇండియాలో ఉంటే ప్రేమించి పెళ్లాడే వాడిని అని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది.

40 ఏళ్ల ఈ యాక్టర్ కేటీ పెర్రీ‌తో జరిగిన తన వివాహం(రాజస్థాన్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది) గురించి చాలా ఫన్నీగా మాట్లాడారు. ‘నేను ఇంత వరకు ఇండియాలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మా పెళ్లి ఘట్టాన్ని మా పెర్ఫార్మెన్స్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే చాలా బాలీవుడ్ ఫిల్మ్స్ మా పెళ్లి బంధం(14 నెలలు మాత్రమే కొనసాగింది. తర్వాత విడిపోయారు)కంటే ఎక్కువ కాలం కొనసాగి ఉంటాయి అంటూ వ్యాఖ్యానించారు.

తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ....నేను ఇండియాలో ఉండి ఉంటే దీపిక పదుకోన్‌ను ప్రేమించి పెళ్లాడే వాడిని. ఆమె చాలా పాపులర్. ఎవరి దగ్గరైనా ఆమె ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే ఇవ్వండి... ఆమెకు ఫోన్ చేస్తాను అంటూ వ్యాఖ్యానించాడు.

రస్సెల్-దీపిక

రస్సెల్-దీపిక

రస్సెల్ బ్రాండ్ దీపిక పదుకోన్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

బెంగుళూర్ కుర్రాడితో..

బెంగుళూర్ కుర్రాడితో..

తన సోదరుడు అజయ్ ఎంగేజ్మెంట్ సందర్భంగా కంగ్రాట్స్ చెబుతూ ఓ వీడియో కావాలని బెంగుళూరు కుర్రాడు సంజయ్...రస్సెల్ బ్రాండ్‌ను అడగ్గా వెంటనే ఓకే చెప్పాడు . ఎప్పుడూ ఇండియాలోనే పెళ్లి కోరుకుంటానన్నారు.

బాలీవుడ్ గురించి

బాలీవుడ్ గురించి

బాలీవుడ్ గురించి మాట్లాడుతూ...షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్ కి ఇప్పటికే హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7లో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్సయింది.

హాటెస్ట్

హాటెస్ట్

ఫిల్మ్ ఫేర్ మేగజైన్ నిర్వహించిన పోలింగులో ఇండియాలో సెక్సియెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

బెస్ట్ మోడల్

బెస్ట్ మోడల్

దీపిక పదుకోన్ ఇండియాలోని టాప్ మోడల్స్ లో ఒకరు.

టాప్ హీరోయిన్

టాప్ హీరోయిన్

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపిక ఒకరు. వరుస హిట్లతో దూసుకెలుతోంది.

పెళ్లి తర్వాత

పెళ్లి తర్వాత

పెళ్లి తర్వాత బాలీవుడ్ ని వదిలిపెడతానంటోంది దీపిక పదుకోన్.

రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు

దీపిక పదుకోన్ నటించిన తమాషా, బాజీరావ్ మస్తానీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

పికు

పికు

దీపిక పదుకోన్ నటించిన ‘పికు' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాపీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది.

English summary
Russell Brand, the world famous comedian, actor and radio host was recently in the country to perform at the Comedy Central Chuckle Festival that was held in Bengaluru, Karnataka.
Please Wait while comments are loading...