Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 8 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 8 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్షయ్ కుమార్ ‘రుస్తుం’: బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్! (యూకె రివ్యూ)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఇలియానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'రస్తుం' ఆగస్టు 12న గ్రాండ్ గా రిలీజవుతోంది. "స్పెషల్ చబ్బీస్", "బేబీ" లాంటి సినిమాల్ని రూపొందించిన దర్శకుడు నీరజ్ పాండే నిర్మాతగా మారి.. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
1959లో నేవీ ఆఫీసర్ కెఎం నానాపతి జవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా స్టోరీలైన్ ఆసక్తికరంగా సాగుతుంది. తన సర్వీస్ ఎన్నో ప్రతిభా పురస్కారాలు అందుకున్న నేవీ ఆఫీసర్ తన భార్యతో వేరొక వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని దొరికిపోవడంతో తుపాకీతో కాల్చి చంపేస్తాడు.
నేవీ ఆఫీసర్ అతన్ని కాల్చి చంపడం వెనక అసలు కారణం ఇది కాదు. మరి ఆ సస్పెన్స్ ఏమిటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి నేవీ ఆఫీసర్ నేపథ్యం ఏమిటి? అతడు దేశ భక్తుడా? విద్రోహా..? లేక హంతకుడా..? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ విడుదలైన చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూకె రిపోర్ట్ వచ్చేసింది. యూకె, యూఏఇలో ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్, ఫిల్మ్ క్రిటిక్‌గా, యూఏఇ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు సినిమా చూసిన తన అభిప్రాయాలు వెల్లడించారు. సినిమాను బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అంటూ పొగుడుతూ...4.5/5 రేటింగ్ ఇచ్చారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలేమిటో స్లైడ్ షోలో చూద్దాం...

అక్షయ్ కుమార్ తన శైలికి భిన్నంగా..
అక్షయ్ కుమార్ ఎక్కువగా కామిక్, యాక్షన్ సినిమాల్లోనే కనిపిస్తారు. అభిమానులు ఆయన నుండి ఆశించేది కూడా ఇలాంటి సినిమాలు. వీటితో పాటు తన సాధారణ శైలికి భిన్నంగా స్పెషల్ చబ్బీస్, బాబీ లాంటి చిత్రాలు తీసారు. ఇపుడు రుస్తుం కూడా అదే కోవలోకి వస్తుందని ఉమైర్ సంధు తెలిపారు.

కెరీర్లోనే చాలెంజింగ్ రోల్
ఈ సినిమాలో అక్షయ్ కుమార పోసించిన రోల్ తన కెరీర్లోనే చాలెంజింగ్ రోల్. అక్షయ్ కుమార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారు. నేవీ ఆఫీసర్ పాత్రలో జీవించారు. నేషనల్ అవార్డు రేంజిలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉందని ఉమైర్ సంధు పొగడ్తలు గుప్పించారు.

ఇలియానా
ఇలియానా అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆ కట్టుకుంది. తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

ఇషా గుప్తా
ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఇషా గుప్తా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇతర నటీనటులంతా బాగా చేసారు అని ఉమైర్ సంధు తెలిపారు.

స్టోరీ, స్క్రీన్ ప్లే
దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఉమైర్ సంధు తెలిపారు.

డైలాగులు, ప్రొడక్షన్, ఎడిటింగ్
డైలాగులు క్లాప్స్ కొట్టేలా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ క్లాసీగా ఉందని తెలిపారు. ఎడిటింగ్ కూడా పెర్ ఫెక్ట్ గా ఉంది అని తెలిపారు.

మ్యూజిక్
మ్యూజిక్ ఆల్రెడీ చార్ట్ బస్టర్. తేరా సాంగ్ యారా వరల్డ్ మ్యూజిక్ చార్టులో టాప్ ప్లేసులో చోటు దక్కించుకుంది... సాంగ్స్ తెరకెక్కించిన విధానం కూడా బావుందని తెలిపారు.

డైరెక్షన్
డైరెక్షన్ సింప్లీ మైండ్ బ్లోయింగ్. స్టోరీ టెల్లింగ్ ఇంటలిజెంట్ గా ఉంది. ఆ కాలానికి సంబంధించిన పరిస్థితులకు తగిన విధంగా సినిమా బాగా తీసారు అని తెలిపారు.

రేటింగ్
ఈ సినిమాకు ఉమైర్ సంధు 4.5/5 రేటింగ్ ఇచ్చారు.

ఉమైర్ సంధు రివ్యూలు నమ్మొచ్చా
గతంలోనూ ఉమైర్ సంధు చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చారు. అందులో కొన్ని నిజం అవ్వగా... మరికొన్ని తలక్రిందులయ్యాయి. బాహుబలికి ఆయన చాలా పూర్ రేటింగ్ ఇచ్చారు. కానీ సినిమా పెద్ద హిట్టయి కూర్చుకుంది. కబాలికి మంచి రేటింగ్ ఇచ్చినా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరి రుస్తుం విషయంలో ఉమైర్ సంధు చెప్పిన విషయాలు ప్రేక్షకుల అభిప్రాయాలతో సరితూగుతాయో? లేదో? రేపు తేలనుంది.