»   » ‘రుస్తుం’ ట్రైలర్ అదిరింది, ఇన్నాళ్లకు మళ్లీ ఇలియానా (వీడియో)

‘రుస్తుం’ ట్రైలర్ అదిరింది, ఇన్నాళ్లకు మళ్లీ ఇలియానా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రుస్తుం' ట్రైలర్‌ విడుదలైంది. అక్షయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశాడు. నేవల్‌ అధికారి కె.ఎమ్‌ నానావతి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని టీనూ సురేశ్‌ దేశాయ్‌ తెరకెక్కిస్తున్నారు.

గత రెండేళ్లుగా అసలు సినిమాలే లేని హీరోయిన్ ఇలియానా... చాలా గ్యాప్ తర్వాత అక్షయ్‌కి జంటగా ఈ సినిమాలో నటిస్తోంది. మరో నటి ఈషా గుప్తా అతిథి పాత్రలో కన్పించనుంది. ఆగస్ట్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Photos: రుస్తుంలో ఇలియానా

Rustom Official Trailer

ముంబైలో 1959లో ఓ నేవల్ ఆఫీసర్ కు సంబంధించిన రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతోంది. ఇతడు దేశభక్తుడా? విద్రోహా? లేక హంతకుడా? అనే ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైరల్ రిలీజ్ చేసారు.

ఇక టైటిల్ అక్షరాల్లో 'ఓ'కు మూడు బుల్లెట్ షాట్స్ ఉన్నాయి. పోస్టర్‌తోనే తమ చిత్రంపై క్యూరియాసిటీని పెంచడంలో చిత్రబృందం సఫలమైంది. ఫ్రైడేస్‌ ఫిలిం వర్క్‌ పతాకంపై టీనూ సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
A dashing naval officer, a beautiful wife and a perfect world. This was Naval Commander Rustom Pavri's life. Three fatal shots change their lives. Based on true events, Rustom is a gripping tale about Pride, Passion and Power, and a man who must his uphold his own integrity and that of the nation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X