»   » ఆర్‌ఎక్స్ 100కు అర్జున్‌రెడ్డి క్రేజ్.. భారీగా ట్రేడ్ జోష్.. ప్రీ రిలీజ్‌ బిజినెస్ టాక్స్..

ఆర్‌ఎక్స్ 100కు అర్జున్‌రెడ్డి క్రేజ్.. భారీగా ట్రేడ్ జోష్.. ప్రీ రిలీజ్‌ బిజినెస్ టాక్స్..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  RX100 Movie Trailer Creates High Business

  టాలీవుడ్‌ వర్గాలను తమవైపు దృష్టిని తిప్పుకొన్న చిత్రం ఆర్ఎక్స్ 100. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త నిర్మాత కలిసి రూపొందించిన ఆ చిత్ర ట్రైలర్‌లో అంతా కొత్తదనమే కనిపించింది. అందుకే ఆర్ఎక్స్ 100 టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రైలర్‌ చూసిన వారంతా ఇన్‌క్రెడిబుల్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ట్రైలర్ సృష్టించిన సంచలనంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఆర్ఎక్స్ 100 ప్రీ రిలీజ్ బిజినెస్ జోరందుకొన్నదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

   అర్జున్‌రెడ్డి క్రేజ్

  అర్జున్‌రెడ్డి క్రేజ్

  గతేడాది రిలీజైన అర్జున్‌రెడ్డికి కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచింది ఆ చిత్రం. ఆ తర్వాత బిజినెస్ బ్రహ్మండంగా జరిగింది. అర్జున్‌రెడ్డి రిలీజ్ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే.

  ఆర్ఎక్స్ 100 చిత్రంపై ఆరా

  ఆర్ఎక్స్ 100 చిత్రంపై ఆరా

  ఇప్పడు ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాకు అలాంటి బజ్ వస్తున్నది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ తర్వాత పరిశ్రమకు చెందిన పెద్దలు ఈ సినిమాపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నట్టు తెలిసింది.

   ప్రముఖ సంస్థ రంగంలోకి

  ప్రముఖ సంస్థ రంగంలోకి

  అలాగే, ఆర్ఎక్స్ 100 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకొనేందుకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రంగంలొకి దిగింది. చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండతో పలు ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమా హక్కులను దక్కించుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

  ఆర్ఎక్స్ 100 ప్రత్యేకతలు

  ఆర్ఎక్స్ 100 ప్రత్యేకతలు

  ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి తొలిసారి సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ వద్ద పలు సినిమాలకు దర్శకత్వం శాఖలో పని చేశారు. రావురమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక పాత్రల్ని పోషించడం ప్రధాన ఆకర్షణగా మారింది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్. కేఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేయడం గమనార్హం.

  హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ

  ఆర్‌ఎక్స్ 100 చిత్రంలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెరపైన వీరిద్దరి కెమిస్ట్రీ అదరగొట్టిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పాయల్ గ్లామర్ గురించి సినీ అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకోవడం విశేషం.

  నటీనటులు

  నటీనటులు

  కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ త‌దిత‌రులు.సాంకేతిక వర్గం: మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్, సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ, స్టంట్స్: రియల్ సతీష్ , ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ), సినిమాటోగ్రఫీ: రామ్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, పీఆర్‌వో: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

  English summary
  RX 100 starring Kartikeya and Payal Rajput in lead roles. The film is said to be a romance drama that happens in a village. Ajay Bhupathi is the director of the movie while the film is produced by Ashok Reddy Gummakonda. The makers launched the theatrical trailer of the film yesterday and it has got the raw feel. The hard-hitting action elements in the movie are sure to impress the youth.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more