»   »  నాన్నపై త్రివిక్రమ్ స్పీచ్ కేక...(S/O సత్యమూర్తి సక్సెస్ మీట్)

నాన్నపై త్రివిక్రమ్ స్పీచ్ కేక...(S/O సత్యమూర్తి సక్సెస్ మీట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: 'S/O సత్యమూర్తి' ఆడియో సక్సెస్ మీట్ విజయవాడ సమీపంలోని హాయ్ ల్యాండ్ లో గ్రాండ్‌గా జరిగింది. ఆడియో రిలీజ్ వేడుకకు ఏ మాత్రం తీసిపోకండా భారీ హంగులు, డాన్స్ కార్యక్రమాలతో ఈ ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. ఈసందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాన్న గురించి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి.

త్రివిక్రమ్ స్పీచ్...
'S/O సత్యమూర్తి' ......సత్యమూర్తి కొడుకు విరాజ్ ఆనంద్ కథ. సాధారణంగా అందరూ అమ్మ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ మనం నడిచేది నాన్న బాటలోనే. ఆరేళ్ల వయసులో ఒకరికి నాన్నే సూపర్ హీరో, పదేళ్లు వచ్చే సరికి నాన్న కంటే చాలా మంది గొప్పవాళ్లున్నారని, పదిహేనేళ్లు వచ్చే సరికి నాన్నకి చాదస్తమని, పెళ్లైన తర్వాత నాన్న చాలా మంచి వాడని అని అనిపిస్తుంది. అదే నలభై ఏళ్లు వచ్చే సరికి నాన్న గొప్పవాడుగా కనబడతాడు. ఆ గొప్పతనాన్ని అంగీకరించేలోపే చాలా మందికి నాన్నలు ఉండరు. నాన్న ఉండగానే ఆయనకు థాంక్స్ చెబుదాం. నాన్నలకు ఓర్పు ఎక్కువ. మన కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ వారి పాత్రకు పెద్ద గుర్తింపు దొరకలేదు. నాన్న నుండి డబ్బు మాత్రమే కాకుండా పేరు, వారసత్వాన్ని తీసుకుని ముందుకు వెళతాం. నాన్న దగ్గర ఇన్ని తీసుకున్నపుడు ఆయనకు ఏమివ్వగలం. ఆయన్ని గుర్తు పెట్టుకుంటే చాలు. నాన్న వేలు పెట్టుకుని నడక నేర్చుకుంటాం. ఆయన భుజాలపై కూర్చొని ప్రపంచాన్ని చూస్తాం. ఆయన ఒళ్లో కూర్చొని చదవడం నేర్చుకుంటాం. ప్రపంచాన్ని చూస్తాం. ఆయన వెళ్లి పోయిన తర్వాత మనం ఒంటరి అయిపోయామని అనుకుంటాం. కానీ నాన్న నీడలా మన వెనకే ఉంటాడు. ఈ సినిమాలో ఇదే చెబుదామనేది నా ఉద్దేశ్యం' అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

బన్నీ మాట్లాడుతూ...

బన్నీ మాట్లాడుతూ...


త్రివిక్రమ్ గారు జులాయి సినిమాతో నా కెరీర్ కిక్ స్టార్ట్ చేసారు. సన్నాఫ్ సత్యమూర్తితో షిప్ట్ గేర్ కొట్టిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత గురించి

నిర్మాత గురించి


నిర్మాత గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ..ఒక మంచి కథ చేసిపెట్టమని నిర్మాత రాధాకృష్ణగారు అనడమే కాకుండా అడిగినవన్నీ సమకూర్చారు అన్నారు. కేవలం మా టీంపై నమ్మకంతోనే రాధాకృష్ణ గారు సినిమా చేసారని బన్నీ అన్నారు.

టీం గురించి త్రివిక్రమ్

టీం గురించి త్రివిక్రమ్


దేవిశ్రీ ఈచిత్రానికి సూప‌ర్ మ్యూజిక్ ని అందిచాడు. ఇక నాతో పాటు ప‌రిగేత్తి ప‌నిచేసిన కెమెరామెన్ ప్రసాద్ మూరేళ్ళ , నా హింస‌ని ప్రేమించి ప‌నిచేసిన ఆర్ట్ డైర‌క్టర్ ర‌విందర్ అండ్ టీం ఇలా ప్రతి టెక్నషియ‌న్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక బ‌న్ని నాకోసం దాదాపు 6 నెల‌లు వెయిట్ చేసి స్క్రిప్ట్ బాగా వ‌చ్చేవ‌ర‌కూ ఏమాత్రం కంగారు ప‌డ‌కుండా ఈ సినిమా చేశాడు. బ్రహ్మనందం గారు బాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేస్తారు. అలీ ఎంత బిజిగా వున్నా కూడా నాకు ఎప్పుడు డేట్ అడిగితే అప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఇస్తాడు అన్నారు.

రిలీజ్

రిలీజ్


S/o సత్యమూర్తి' చిత్రం ఈ నెత 9న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆడియో వేడుక, ఆడియో సక్సెస్ మీట్లు నిర్వహించడం ద్వారా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం


పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Photos of S/o Satyamurthy Audio Success Meet event held at Vijayawada.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu