twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’ హిందీ రీమేక్ హీరో నేను కాదు కానీ...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవబోతోంది. ఈ చిత్రం ఈ రెండు భాషల రైట్స్ ని సచిన్ జోషి(ఒరేయ్ పండు హీరో) తీసుకుని,హీరోగా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కొంత నిజమే కానీ తాను హీరోగా చేయటం లేదంటూ ఖండించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    సచిన్ జోషి స్పందిస్తూ...."నేను కేవలం హిందీలో నిర్మిస్తున్నాను అంతే..తెలుగులో ప్రొడ్యూస్ చేసినట్లుగనే హిందీలోనూ చేస్తాను ...అంతేతప్ప నేను హీరోగా చేయను..ఈ విషయం మీద రెండో ఆలోచన వద్దు...ఓ పెద్ద హీరోని ఈ చిత్రం రీమేక్ లో చేయటానికి ఎప్రోచ్ అవుతున్నాను.త్వరలోనే హిందీ వెర్షన్ వివరాలు తెలియచేస్తాను ", అన్నారు సచిన్.

    బండ్ల గణేష్ కి, సచిన్ జోషి కి ఉన్న అనుబంధంతో ఈ రైట్స్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. సచిన్ జోషి ఇంతకు ముందు చేసిన నీ జతగా నేనుండాలి చిత్రం (ఆషికి2 రీమేక్) ని బండ్ల గణేష్ నిర్మించిన సంగతి తెలిసిందే.

    సచిన్ జోషి గతంలో ఒరేయ్ పండు(ఎస్వీ కృష్ణా రెడ్డి), నిన్ను చూడక నేనుండలేను చిత్రాలు చేసారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు సచిన్ జోషి. ఎఫైర్ టైటిల్ తో ఆ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఇక టెంపర్ రీమేక్ పై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

    ఇక బాక్సాఫీసు దగ్గర వసూళ్ల దండయాత్ర చేస్తూ తన 'టెంపర్‌' చూపిస్తున్నాడు ఎన్టీఆర్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చక్కటి ఫలితాన్ని రాబట్టింది. దాంతో ఈ చిత్రం నిర్మాత, యూనిట్ ఆనందోత్సాహాల్లో ఉన్నారు.

    మరో ప్రక్క 'ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరికొత్తగా కనిపిస్తున్నాడ'అంటూ అభిమానులు సంబర పడిపోతున్నారు. దయాగా ఎన్టీఆర్‌ నటన బాగుందంటూ సినీ ప్రముఖులు కితాబులు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు దయ మళ్లీ రాబోతున్నాడు. విషయమేంటంటే.. 'టెంపర్‌' సీక్వెల్‌ తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్‌ అధికారికంగా ధ్రువీకరించారు కూడా.

    Sachiin Joshi Denies Wearing NTR's Shoes

    ''ప్రస్తుతం 'టెంపర్‌' అందించిన విజయానందంలో ఉన్నాం. ఈ చిత్రం ఇచ్చిన నమ్మకంతో సీక్వెల్‌కూ రంగం సిద్ధం చేస్తున్నాం. మా టీమ్‌ మళ్లీ ఓ మంచి సినిమా అందివ్వబోతోంది'' అని చిత్ర బృందం చెబుతోంది. ఎన్టీఆర్‌ రాబోయే చిత్రాల జాబితాలో 'టెంపర్‌ 2' కూడా చేరిపోయిందన్నమాట.

    ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

    ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కొట్టారు.

    ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. రూ. 10.75 కోట్ల వసూళ్లతో ‘అత్తారింటికి దారేది' చిత్రం మొదటి స్థానంలో ఉండగదా, రూ. 9.74 కోట్లతో ‘దూకుడు' రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ‘టెంపర్' మూవీ దాదాపు 22 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి

    టెంపర్ కథేమిటంటే...

    వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    "I'm just producing Temper in Hindi, like I produced it in Telugu recently. Already we have approached a big star for the remake, and discussions are on. Never, I thought of acting in the movie as a lead; no second thoughts about it. Very soon I'll announce the Hindi version details", said Sachin Joshi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X