»   » క్రికెట్ దేవుడు ‘సచిన్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఆ రాత్రంతా నిద్ర పోయేవాడు కాదు.. అంజలీ..

క్రికెట్ దేవుడు ‘సచిన్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఆ రాత్రంతా నిద్ర పోయేవాడు కాదు.. అంజలీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' సినిమా ట్రైలర్ విడుదలైంది. సినీ ప్రేక్షకులనే కాకుండా, క్రీడామానులను కొద్ది నిమిషాలపాటు ట్రైలర్ ఉద్వేగానికి గురిచేసింది. సచిన్ జీవితంలోని కీలక ఘట్టాలను ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలుగా జోడించారు. ఈ చిత్రం మే 26న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

సచిన్ వాయిస్ ఓవర్‌తో..

క్రికెట్ దేవుడు సచిన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభవుతుంది. ‘నాకు అప్పుడు పదేళ్లు. భారత్ 1983లో ప్రపంచ క్రికెట్ కప్ గెలిచింది. అప్పుడే నా క్రికెట్ ప్రయాణం, కల ప్రారంభమైంది అని సచిన్ పేర్కొన్నాడు. ట్రైలర్‌లో సచిన్ సతీమణి అంజలి కూడా తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. జట్టు సరిగా ఆడకపోతే ఆ రోజంతా సచిన్ మనోవేధనకు గురయ్యేవాడు. ఆ రాత్రి అంతా నిద్ర పోయేవాడు కాదు అని అంజలి చెప్పారు.

22 అడుగుల పిచ్‌పై సాగిన..

సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్ర ట్రైలర్ విడుదలను పురస్కరించుకొని సచిన్ బుధవారం ట్వీట్ చేశారు. 22 అడుగుల పిచ్‌పై సాగిన ప్రయాణాన్ని మరోసారి తెరపైన కొత్త అనుభూతికి కావడానికి సిద్ధంకండి అంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు సినిమా విడుదలకు సంబంధించిన తేదీని ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ చిత్ర పోస్టర్ గతేడాది ఏప్రిల్ విడుదలైంది.

మూడో చిత్రమిది..

క్రికెటర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూడో చిత్రం సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్. ఈ సినిమాకు ముందు అజర్, ఎంఎస్ ధోని: అన్ టోల్డ్ స్టోరి చిత్రాలు బాలీవుడ్ తెరపై ఆవిష్కరించబడ్డాయి. సచిన్ సినిమాకు జేమ్స్ ఎర్‌స్కైన్ దర్శకత్వం వహించారు. రవి భగ్‌చంద్క నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కార్నివాల్ మోషన్ పిక్చర్స్‌పై రూపొందింది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

ఎప్పుడెప్పుడా అని...

అజ‌ర్‌, ధోనీల జీవిత కథపై తెరకెక్కిన సినిమాలకు అటు సినీ అభిమానులు, ఇటు క్రీడాభిమానుల నుంచి మంచి ఆదరణ లభించడంతో సచిన్ చిత్రం కూడా భారీ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బుల్లితెరపైన ఇనాళ్లు సచిన్ ఆరాధించిన అభిమానులు ఇక వెండితెర మీద ఈ సినిమా ఎప్పుడెప్పుడూ చూద్దామా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

English summary
Sachin Tendulkar’s much-awaited biographical film "Sachin: A Billion Dreams" set to release on May 26, the trailer will be out on Thursday in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu