సదా 'కథా' స్మరామి

'అపరిచితుడు' తరువాత చెప్పుకోతగ్గ హిట్టనేది లేక పోవటంమే కాక ఆఫర్ల జోరు కూడా తగ్గటంతో చేసేదేం లేక సదా ఈ నిర్ణయానికి వచ్చింది. నితిన్ సరసన రెచ్చిపోయి సోయిగాలు ఒలకపోస్తూ ఆమె చేసిన 'టక్కరి' లైఫిస్తుందని భావించింది. కాని ఈ 'జయం' అమ్మాయికి అపజయం ఎదురైంది. కథా లోపం తన నటనని డామినేట్ చేసి డామేజ్ చేసిందని అర్ధం చేసుకుందిట. దాంతో ఈ సారి సరైన కథ ఉన్న సినిమా ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యిందిట. ఈ ప్రాసెస్ లో కొన్ని తిప్పికొట్టానంటోది. అప్పుడు వచ్చిందిట ఈ అవకాశం. బృందావనం కథ ఫ్యామిలీలకు పట్టేలా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండటంతో వెంటనే మరో ఆలోచన లేకుడా ఒప్పుకుందిట. ఈ సినిమా నిలబడితే లైమ్ లైట్ లోకి మళ్ళీ వచ్చి అదరకొడదామనే ఆశతో ఉందిట. బెస్టాఫ్ లక్ సదా!


Click it and Unblock the Notifications











