»   » క్రికెటర్ జహీర్ ఖాన్‌తో ఆ హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇదిగో వివరాలు...

క్రికెటర్ జహీర్ ఖాన్‌తో ఆ హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇదిగో వివరాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే, క్రికెటర్ జహీర్ ఖాన్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది మే నెల చివర్లో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.

తాజాగా సాగరిక-జహీర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 27వ తేదీన వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే వీరి వాహం జరుగనున్నట్లు సమాచారం. సాగరిక, జహీర్ ఇప్పటి నుండే పెళ్లి షాపింగ్, ఇతర పనులు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఐపీఎల్ సీజన్లో వ్యవహారం బట్టబయలు

ఐపీఎల్ సీజన్లో వ్యవహారం బట్టబయలు

'చక్ దే ఇండియా'లో నటించిన సాగరిక ఘట్గే, ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. అప్పటి వరకు సీక్రెట్ గా తమ ప్రేమ వ్యవహారం కొనసాగించిన ఈ జంట లాస్ట్ ఐపీఎల్ సీజన్ సమయంలో తమ లవ్ ఎఫైర్ గురించి బయట పెట్టారు.

రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు

రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు

ఐపీఎల్ మ్యాచ్‌ల గ్యాపులో సాగరికను గోవా తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ జహీర్ ఖాన్ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. ఆమె నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ విషయాన్ని జహీర్ ఖాన్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా అపీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.

సర్పైజ్ అయిన సాగరిక

సర్పైజ్ అయిన సాగరిక

జహీర్ ఖాన్ ప్రపోజ్ చేసిన అనంతరం మీడియాతో సాగరిక మాట్లాడుతూ.... ‘ఇది నాకు సర్పైజ్ లాంటిదే. ఐపీల్ సీజన్లో మధ్యలో ఇలాంటి సర్పైజ్ ఎదురవుతుందని నేను ఊహించలేదు. మ్యాచ్ మధ్యలో రెండు రోజులు సిటీకి దూరంగా వెళ్లాలని అనుకున్నాం. గోవా వెళ్లాం... అక్కడ జహీర్ అలా ప్రపోజ్ చేయడం జరిగిందని అని సాగరిక తెలిపారు.

తొలిసారి అలా లీక్

తొలిసారి అలా లీక్

జహీర్ ఖాన్, సాగరిక మధ్య ఎఫైర్ ఉన్న విషయం తొలిసారిగా యువరాజ్ సింగ్ వెడ్డింగ్ సమయంలో అందరికీ తెలిసిపోయింది. ఆ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరయ్యారు.

గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్

గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్

జహీర్ ఖాన్, సాగరిక ఎంగేజ్మెంట్ మే నెలలో గ్రాండ్ గా జరిగింది. వేడుకకు సచిన్, కోహ్లితో పాటు పలువురు ప్రముఖ క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

English summary
Sagarika Ghatge to marry Zaheer Khan on November 27. Sagarika told IndianExpress.com that the couple has decided to tie the knot on November 27.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu